14 ఏళ్ళ బాలిక గ్యాంగ్‌ రేప్‌

14 year school girl kidnapped and raped in delhi

10:58 AM ON 14th December, 2015 By Mirchi Vilas

14 year school girl kidnapped and raped in delhi

ఒక మైనర్‌ బాలికను ఎత్తు కెళ్ళిన దుండగులు ఆమె పై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ దారుణమైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రోజులాగే 14 ఏళ్ళ బాలిక తన ఇంటి నుండి స్కూలు కు వెళ్తుండగా ఒక టాటాసుమో వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనంలో బాలికకు తెలిసిన వ్యక్తి ఉండడంతో వాహనం ఎక్కింది.

అప్పటికే ఆ వాహనంలో ఇంకో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వాహనంలో ఎక్కిన బాలికను కిడ్నాప్‌ చేసి ఢిల్లీ లోని దిచ్‌ఆన్‌ గ్రామశివారు ప్రాంతంలోకి బాలికను తీసుకువెళ్ళి వారు ఆరుగురు 14 ఏళ్ళ మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నిన్ను,నీ తమ్ముడుని చంపేస్తా మంటూ బెదిరించారు. ఈ లోపు బాలిక అరుపులను గమనించిన ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటాన వచ్చి వారందరిని పట్టుకుని అరెస్ట్‌ చేసారు.

ఈ దారుణమైన ఘటనలో అత్యాచారానికి పాల్పడిన రాహుల్‌(19), సూరజ్‌(19), సందీప్‌(21), రమేష్‌(27), నరేందర్‌(20), అమన్‌(23) ల పై పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాలిక తండ్రి మాట్లాడుతూ తన కూతిరిని ఒంటరిగా స్కూలుకు పంపడమే తాను చేసిన తప్పని. నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని బోరున విలపించారు.

English summary

A 14 year minor school girl in dehli was kinapped and raped by six in delhi. Police arrested that six members and filed case on them