అబార్షన్లలో 15 ఏళ్ళ లోపు అమ్మాయిలే ఎక్కువట

144 percent 15 years girls going for abortions

12:47 PM ON 17th May, 2016 By Mirchi Vilas

144 percent 15 years girls going for abortions

వచ్చీ రాని వయస్సులో సెక్స్ ఆలోచనలు పెంచుకోవడం వలన యువత పక్కదారి పడుతోంది. ముఖ్యంగా 15 ఏళ్ళలోపు అమ్మాయిలు ఈ ఉచ్చులో పడిపోతున్నారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్, బీఎంసీ సంయుక్తంగా చేసిన సర్వేలో ఇందుకు సంబంధించి భయంకర నిజాలు వెల్లడయ్యాయి. 2015-16 సంవత్సరానికి సంబంధించి ఎంటీపీ సెంటర్లలో మొత్తం 34,790 అబార్షన్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2014-15తో పోల్చుకుంటే దాదాపు 13 శాతం పెరిగింది. అంతేకాదు, 15 సంవత్సరాలలోపు అమ్మాయిలే ఎక్కువట. పైగా ఇలా అబార్షన్ చేయించుకుంటున్న15 ఏళ్ళ లోపు అమ్మాయిల సంఖ్య గడిచిన మూడేళ్లలో 144 శాతం పెరిగిపోయిందట.

2014-15లో 185 ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 271కి చేరింది. వీరిలో చాలామంది తల్లిదండ్రుల దగ్గర విషయాన్ని దాచిన వారే ఉన్నారని ఎంటీపీ రికార్డుల్లో తేలింది. ఒక్క ముంబయి నగరంలో మాత్రమే ఈ పెరుగుదల కనిపించడం ఒకింత ఆందోళనకు గురిచేసే విషయం. ఎక్కువ అబార్షన్ కేసుల్లో 12 వారాల ప్రెగ్నెన్సీ కేసులే ఉండటం గమనార్హం. యువతీయువకుల ఆలోచనలో మార్పు రావాలని... ముఖ్యంగా యువత శృంగారపరమైన ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలని, చదువు తదితర అంశాల పై దృష్టి మళ్ళించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తూ, లేకుంటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

English summary

144 percent 15 years girls going for abortions