అక్టోబర్ లో పండగలే పండగలు.. 15రోజులు సెలవలు!

15 holidays in October month

03:11 PM ON 26th September, 2016 By Mirchi Vilas

15 holidays in October month

మరో నాలుగు రోజుల్లో సెప్టెంబర్ నెల ముగిసి అక్టోబర్ నెల వస్తుంది. ఆ ఏముంది ఎప్పటిలానే మరో నెల వస్తోంది అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు తప్పులో కాలిసినట్లే.. ఎన్నో విశిష్టతలను అక్టోబర్ వెంటబెట్టుకుని మరీ వస్తోంది. ఈ నెలలో ఐదు శని, ఆది, సోమవారాలు వస్తున్నాయి. ఇది రావడం కొంత అరుదు. 1, 8, 15, 22, 29 తేదీల్లో శనివారం, 2, 9, 16, 23, 30 తేదీల్లో ఆదివారం, 3, 10, 17, 24, 31 తేదీల్లో సోమవారం వస్తున్నాయి. ఇంకా విశేషమేమంటే, బతుకమ్మ, దసరా, దీపావళి, పీర్ల పండుగ కూడా ఈ నెలలోనే. 11న దసరా, 12న పీర్ల పండగ, 30న దీపావళి ఉన్నాయి.

ఐదు ఆదివారాలు, మూడు పండగలు, రెండు, నాలుగు శనివారాలు కలిపి ప్రభుత్వ ఉద్యోగులకు 9 సెలవులు రానుండగా, విద్యార్థులకు దాదాపు సగం రోజుల పాటు సెలవలే. ఇంకో చిన్న విశేషం ఏంటంటే, 2వ తేదీ ఆదివారం నాడు అమావాస్య, 16వ తేదీ ఆదివారం నాడు పౌర్ణమి, 30వ తేదీ ఆదివారం నాడు మరో అమావాస్య రానున్నాయి. ఇది అత్యంత అరుదు. మరి అక్టోబర్ నెల స్పెషలేకదా..!

ఇది కూడా చదవండి: వ్యభిచారం చేస్తున్న స్టార్ హీరోయిన్ సిస్టర్.. రోజుకి 5లక్షలు.. ఎవరో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: గుండెపోటు వచ్చే నెల ముందే మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి!

ఇది కూడా చదవండి: కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే రోజూ ఇవి తినాల్సిందే!

English summary

15 holidays in October month. In October month their is 15 holidays. 5 sundays, and dussera and deepawali festivals.