శవంతో...తిండిలేకుండా.. పసిపాప దుస్థితి

15-month-old survives one week without food

05:56 PM ON 21st November, 2015 By Mirchi Vilas

15-month-old survives one week without food

ఒక్కపూట తిండి లేకుంటేనే మనకు కడుపులో ఎలుకలు ఎఫ్‌1 రేస్‌ పెట్టుకుంటాయి. అలాంటిది సంవత్సరంన్నర వయస్సున్న ఒక పసిపాప వారంరోజులకన్నా ఎక్కువగా ఒక శవం మధ్య తిండీతిప్పలు లేకుండా ఉన్న దుస్థితిని తలచుకుంటే ఏమనిపిస్తుంది. ఈ హృదయ విదారక ఘటన వివరాలలో కెళితే... యుకెలోని మారీవిల్లేలో 15నెలలు ఉన్న పాపను అపస్మారక స్థితిలో పోలీసులు కనుగొన్నారు. రోజ్‌ అనే ఈ పాప తల్లి ఒక పోలీసు కేసు విషయంలో జైలు పాలవ్వగా, తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది.తన పాప బాగోగులు తెలుసుకునేందుకు రోజ్‌ తల్లి తన తల్లికి ఫోన్‌ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎటువంటి సమాధానం లేకపోవడంతో ఆఖరికి తనకు తెలిసిన వ్యక్తిని పంపించింది. ఆ వ్యక్తి రోజ్‌ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి చూడగా ఆ పసిపాప అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉండడం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి డోర్‌ బద్దలు గొట్టి లోపలికి వెళ్ళి చూడగా అప్పటికే పాప అమ్మమ్మ విగతజీవురాలై కనిపించింది. అపస్మారక స్థితిలో కొనప్రాణంతో ఉన్న రోజ్‌ను పోలీసులు హాస్పటల్‌కు చేర్చారు. ఇప్పుడు పాప చికిత్స పొందుతుండగా, తన అమ్మమ్మ మృతికి చెందిన కారణాలు ఇంకా తెలియరాలేదు.

English summary

A year old baby girl has survived for one week without food or water after her grandmother unexpectedly died. A 15-month-old girl in Tennessee survived a week trapped in her cradle with no food or water, after her grandmother, who was taking care of her, died on the bathroom floor.