ఇంజక్షన్ రియాక్షన్ ఇచ్చి ... ఆపై .. ప్రాణమే పోయింది

15 years old Girl burnt by drugs reaction dead in Hyderabad

11:23 AM ON 7th July, 2016 By Mirchi Vilas

15 years old Girl burnt by drugs reaction dead in Hyderabad

కొన్ని ఆసుపత్రులు జనం కోసం పనిచేస్తున్నా, కొన్ని హాస్పిటల్స్ కేవలం డబ్బే ధ్యేయంగా జనాన్ని పిండేస్తున్నాయి. నిర్లక్ష్యం సరేసరి. ఇక ఈ ఘటన విషయంలోకి వెళ్తే, కొద్దిరోజుల కిందట 15 ఏళ్ల మీనాక్షి గాంధీ అనే యువతి.. పిట్స్ కోసం ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది. యువతి ఎందుకు మరణించింది? కారణమేంటి? లోతుగా వెళ్తే భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన మీనాక్షి పిట్స్ సమస్యతో బాధపడుతోంది. ఇటీవల ఆమెకు జ్వరంతోపాటు పిట్స్ రావడంతో యువతి తండ్రి, ఆమెను కార్పొరేట్ ఆసుపత్రిలో అయితే జబ్బు వేగంగా నయమవుతుందని భావించి కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఐతే, గ్లూక్లోజ్ లో ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి ఆమె శరీరమంతా గుర్తుపట్టలేని విధంగా తయారైంది. తల నుంచి కాలి బొటన వేలు వరకు కాలిపోయింది. వెంటనే ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని అక్కడి డాక్టర్లు తేల్చిచెప్పేశారు. దీంతో జూన్ 22న గాంధీకి తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది.

మీనాక్షి మృతిపై గాంధీ సూపరిండెంట్ మాట్లాడుతూ కెమికల్ రియాక్షన్ వల్ల మీనాక్షి శరీరం పూర్తిగా కాలిపోయిందని తేల్చేశారు. ఉష్ణోగ్రతను నియంత్రిచడంలో శరీరం చాలా కీలకమైందని, అంతా పూర్తిగా కాలిపోవడంతో ఇది సాధ్యం కాలేదన్నారు. కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో ఓ విషయం చక్కర్లు కొట్టింది. విషయం ఏంటంటే.. ఇండియాలోని చాలా ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ వికటించిన ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందంటూ బయటపడింది. దీనిపై ఇటు నెటిజన్స్.. అటు డాక్టర్లకు మధ్య పెద్ద వార్ జరిగిన విషయం తెల్సిందే! ఈ వ్యవహారం జరిగి 10 రోజుల తర్వాత హైదరాబాద్ సిటీలోవున్న కార్పొరేట్ ఆసుపత్రిల్లో ట్రీట్ మెంట్ వికటించిన ఇద్దరు చనిపోయారు. దీంతో కార్పొరేట్ వైద్యం అంటే భయపడే పరిస్థితి సామాన్యుల్లో ఏర్పడింది. సిబ్బందికి సరైన ట్రైనింగ్ లేక ఇలాంటి మరణాలు పెరుగుతున్నాయనే కామెంట్స్ పడిపోతున్నాయి.

ఇది కూడా చూడండి: శ్రీమంతుల అందమైన కూతుళ్ళు

ఇది కూడా చూడండి: మరణానికి దగ్గరవుతున్న వారిలో లక్షణాలు

ఇది కూడా చూడండి: పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్

English summary

A 15 Year old girl Menakshi Burnt By Drugs Reaction Dead.