అమ్మో!  1500 ఏళ్ల  నాటి  శవానికి అడిడాస్ షూస్!

1500 year old mummy wearing Adidas Shoes

09:50 AM ON 28th April, 2016 By Mirchi Vilas

1500 year old mummy wearing Adidas Shoes

అవును.. 15వందల ఏళ్ల వయసున్న ఓ శవం అడిడాస్ షూస్ ధరించి ఉందట. తాజాగా ఇది వెలుగు చూసింది. మంగోలియాలోని అల్తాయ్ పర్వత ప్రాంతంలో సముద్ర మట్టానికి 2,800 మీటర్ల ఎత్తులో పురావస్తు శాఖవారి కంట పడింది. తవ్వకాల్లో లభ్యమైన 1,500ఏళ్ల నాటి మమ్మీ మృతదేహానికి చారలు ఉన్న షూస్ ఉన్నాయని ఖోవ్‌ద్ మ్యూజియం ఎక్స్ పర్ట్ సుఖ్‌బాతర్ తెలిపారు. మమ్మీ వెలుగు చూసిన ప్రాంతం టర్కీకి చెందిన సమాధి స్థలంలా ఉందని అధికారులు అంటున్నారు. గిన్నె కూడా దొరికింది. ఇక్కడ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం వల్లే డెడ్ బాడీ పాడవలేదని పురావస్తుశాఖ అధికారులు అంచనాకు వచ్చారు. షూస్‌ పై తెల్లటి చారలు, స్పోర్ట్స్ బ్రాండ్‌ను సూచించే ఎంబ్లమ్ కూడా ఉండటం కొత్త ఆలోచనలకు తావిస్తోంది. మొత్తానికి ఇది చర్చకు దారితీసింది.

English summary

Archaeologists found that 1,500-year-old female mummy was wearing red Adidas Sgoes with three distinctive white stripes, an emblem which is now synonymous with the sports brand. This was found in Mongolia's Altai Mountains, 2,800 metres above sea level.