వన్ రుపీ నోట్లు 16 కోట్లు

16 crores 1 rupee notes issued By RBI

04:40 PM ON 4th January, 2016 By Mirchi Vilas

16 crores 1 rupee notes issued By RBI

రెండేళ్ల కాలంలో సుమారు 16 కోట్ల రూపాయి నోట్లను మార్కెట్లోకి జారీ చేసినట్లు సమాచార హక్కు చట్టం కింద కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు రూపాయి నోట్ల ముద్రణను నిలిపివేసిన కేంద్రం ఈసారి భారీగా నోట్లను విడుదల చేసింది. గడిచిన 20 సంవత్సరాల్లో ఎన్ని రూపాయి నోట్లను జారీ చేశారంటూ ఢిల్లీకి చెందిన సుభాష్ చంద్ర అగర్వాల్, ముంబైకి చెందిన మనోరంజయ్ రాయ్ సమాచార హక్కు చట్టం కింద పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు కరెన్సీ నోట్ ప్రెస్ హెచ్‌ఆర్ విభాగ డిప్యూటీ మేనేజర్ జీ కృష్ణ మోహన్ సమాధానమిస్తూ.. 1994-95 సంవత్సరంలో 4 కోట్ల రూపాయి నోట్లను జారీ చేసిన తర్వాత మళ్లీ 2013-14 వరకు ఈ నోట్ల ముద్రణను నిలిపివేశామన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల నోట్లను విడుదల చేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2015-16) 15.5 కోట్ల నోట్లను జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

English summary

Indian Finance Ministry issued as many as 16 crore currency notes of one rupee denomination in the last two years, nearly two decades after they were taken off print, response to queries made under the RTI Act showed.