అమెరికా మైదానంలో కాల్పుల మోత

16 Wounded in Shoot out in New Orleans

10:40 AM ON 23rd November, 2015 By Mirchi Vilas

16 Wounded in Shoot out in New Orleans

అమెరికాలోని న్యూ ఆర్లియాన్స్ బన్నీ ఫ్రెండ్‌ మైదానం తుపాకీ మోతలతో దద్దరిల్లింది. ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. కొందరు నేలపై పడుకుని ప్రాణాలను దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో 16 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఇద్దరు సాయుధులు మైదానంలోకి చొరబడి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షుల కధనం. ఈ సంఘటన జరిగిన సమయంలో దాదాపు 500 మంది మైదానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మ్యూజిక్ వీడియో షూటింగ్ చేస్తుండగా కాల్పులు జరిగాయి. గాయపడినవారికి యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌లో చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary

Hundreds of people were gathered at a New Orleans playground for a music video shoot when two groups in the crowd opened fire on each other, wounding 16 people in the shocking Sunday evening violence.