తల్లిదండ్రుల స్వార్ధానికి బలైన బాలిక 

16 Year Girl Commits Sucide In Hyderabad

05:10 PM ON 28th November, 2015 By Mirchi Vilas

16 Year Girl Commits Sucide In Hyderabad

వివిధ కారణాల వల్ల భార్య భర్తలు విడిపోగా వారిని కలిపేందుకు ప్రయత్నించి చివరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టింది ఓ బాలిక. వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్‌ పార్మిగుట్ట సంజీవపురానికి చెందిన రాజు-జగదీశ్వరిలు భార్యభర్తలు. అయితే కొన్ని మనస్పర్ధల వల్ల వీరు విడిపోయి విడివిడిగా ఉంటున్నారు. వీళ్ళిదరికి హరిత అనే 16 ఏళ్ళ కుమార్తె ఉంది... హరిత స్థానిక పాఠశాలలో 9 వ తరగతి చదువుతోంది. హరిత తన తల్లి దగ్గరే ఉంటుంది . తన తల్లిదండ్రులతో కలిసి హాయిగా జీవించాలని హరిత ఎప్పుడు ఆమె స్నేహితులు, చుట్టు ప్రక్కల వారితో చెబుతుండేది. కానీ ఎన్ని సార్లు చెప్పినా హరిత తల్లిదండ్రులు కలిసి జీవించడానికి అంగీకరించక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనా హరిత ఎవరూలేని సమయంలో ఒంటి పై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో నుండి పొగలు రావడం చూసిన చుట్టుప్రక్కల వారు లోపలికి వెళ్ళే లోపే ఆమె మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చెసుకున్న చిలకలగూడ పిఎస్‌ పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు.

English summary

A 16 year girl named haritha commits sucide in hyderabad. She fired herself by using kerosene oil.Police files a case and investigating the reasons behind her sucide