పిల్లలకు పేర్లు పెట్టి లక్షలు సంపాదిస్తున్న పదహారేళ్ళ బాలిక!

16 years girl earning lakhs by naming for kids

01:31 PM ON 10th September, 2016 By Mirchi Vilas

16 years girl earning lakhs by naming for kids

పెళ్లి కాకముందే కొందరు పిల్లలకు ఏం పేరుపెట్టాలని ఆలోచన చేస్తుంటారు. ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అంటూ పెద్దవాళ్ళు జోక్ చేస్తుంటారు. ఇక పెళ్లయ్యాక, ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గరనుంచీ పిల్లాడో, పిల్లో పుడితే ఏం పేరు పెట్టాలి? ఎలాంటి పేరు పెట్టాలి? అని తల్లిదండ్రులు తెగ హైరానా పడుతుంటారు. బంధువులను సంప్రదిస్తారు, నెట్ లో వెతుకులాట చేస్తారు. వారం.. తిథి.. నక్షత్రం ప్రకారం ఏ అక్షరం పలుకుతుందో పెద్దలను, పండితులను అడిగి తెలుసుకుంటారు. కానీ.. చైనీయులు మాత్రం తమ పిల్లలకు పేర్లు పెట్టేందుకు ఓ పదహారేళ్ల బాలిక వద్దకు క్యూ కడుతున్నారు.

1/4 Pages

అలా పేర్లు పెట్టడాన్నే వ్యాపారంగా మలచుకుని, ఆ బాలిక లక్షలు కూడపెడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ కి చెందిన బ్యూ జెసప్(16) అనే విద్యార్థిని ఆరు నెలల్లో రెండున్నర లక్షల మంది చైనా పిల్లలకు నామకరణం చేసింది. సిండ్రెల్లా.. మేరీ.. అలెగ్జాండర్.. రోజీ వంటి ఇంగ్లీషు పేర్లను పెట్టింది. ఇదిలా ఉంచితే, ఆ విద్యార్థిని కేవలం 6నెలల్లోనే రెండు లక్షల పైచిలుకు ఇంగ్లీషు పేర్లు పెట్టి రూ. 42లక్షలకుపైగా సంపాదించింది. అయితే ఎప్పుడూ సొంత భాషకే ప్రాధాన్యమిచ్చే చైనీయులకు ఇంగ్లీషు పేర్లపై మోజు పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే చైనా విద్యార్థులు యూకేలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు దరఖాస్తులు పూరించాలంటే వారి స్థానిక పేర్లు పనిచేయవట.

English summary

16 years girl earning lakhs by naming for kids. China girl Beau Jessup earning lakhs of money by naming for kids