16 ఏళ్ళ కుర్రాడ్ని బట్టలూడదీసి తన్నారు

16 years old boy harassed in delhi by group

09:50 AM ON 28th May, 2016 By Mirchi Vilas

16 years old boy harassed in delhi by group

ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు... దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం చోటు చేసుకుంది. మందు కొట్టిన తాగుబోతులు కొందరు 16 ఏళ్ళ కుర్రాడి బట్టలూడదీసి కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి, దుండగుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుండగులు బాధితుడి కాళ్ళు, చేతులు కట్టివేసి విచక్షణా రహితంగా కొడుతున్న దృశ్యాన్ని కొందరు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. బాధతో ఆ బాలుడు కేకలు పెడుతుండగా బీర్ బాటిల్స్ తో చెప్పలేని పనులు చేశారని తెలిసింది. అటు బాధితుడి రహస్యాంగం పై బీర్, కారప్పొడి వేసి వీధంతా తిప్పారని, దీంతో తట్టుకోలేక ఆ కుర్రాడు ఆత్మహత్యాయత్నం చేశాడని అతని బంధువర్గాలు తెలిపాయి.

అయితే ఈ ఆరోపణను పోలీసు అధికారులు తోసిపుచ్చారు. ఓ మురికివాడలోని అల్లరిమూకలే ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

English summary

16 years old boy harassed in delhi by group