కశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు - 17 మంది జవాన్ల వీర మరణం

17 Soldiers Killed In Terrorist Attack in Uri Sector In Kashmir

02:19 PM ON 19th September, 2016 By Mirchi Vilas

17 Soldiers Killed In Terrorist Attack in Uri Sector In Kashmir

ఉగ్రవాదం మరో సారి పంజా విసిరింది. తాజాగా జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బారాముల్లలోని యూరీ సెక్టార్ లోగల ఆర్మీ కార్యాలయంపై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాడులను తిప్పికొట్టారు. కొన్ని గంటలపాటు కొనసాగిన ఈ ఎన్ కౌంటర్ లో 17 మంది సైనికులు అమరులయ్యారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. అయితే జవాన్ల మృతిని ఆర్మీ అధికారికంగా ధృవీకరించలేదు.

జమ్ముకశ్మీర్ లోని యూరి సెక్టార్ లో సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి గత జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిని గుర్తుచేసింది. పఠాన్ కోట దాడిలో కంటే యూరి దాడిపై ఎక్కువ సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనలో 7 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయపడ్డారు. యూరీ సెక్టార్ లో ఎన్ కౌంటర్ పై ప్రధాని మోడీ సమీక్షించారు. రక్షణ మంత్రి పరీకర్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ ఇవాళ ఘటనాస్థలికి వెళ్లనున్నారు. ఉగ్రదాడి తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. ఎల్ వోసీ సహా బారాముల్లా..యూరీ సెక్టార్ లో రహదారులు మూసివేశారు.

1/7 Pages

నిద్రిస్తున్న జవాన్లపై గ్రెనేడ్లతో దాడి చేసి..

ఇంత పెద్ద సంఖ్యలో జవాన్లు మృతి చెందడం ఈ ఏడాది ఇదే ప్రథమం. జవాన్లు నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో గ్రనేడ్లతో ఉగ్రవాదులు దాడి చేసి ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో సైనిక స్థావరంలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది తాత్కాలిక టెంట్లలో ఉన్నారు. గ్రనేడ్ దాడితో టెంట్లకు నిప్పుంటుకుని సిబ్బంది తీవ్రంగా గాయపడటంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. తీవ్రంగా గాయపడిన 12 మంది జవాన్లను వెనువెంటనే హెలికాప్టర్ల ద్వారా శ్రీనగర్ లోని ఆసుపత్రులకు తరలించారు.

English summary

Terrorists again attacked in Kashmir and killed 17 Indian Soldiers and 23 soldiers were seriously injured in this incident. Terrorists attacked the Army Base camp in Uri Sector in Kashmir at early morning 4 A.M while soldiers were sleeping. Soldiers killed 4 Terrorists. Popular Personalities in India were opposed this attack and fired over Pakistan.