వాడికి 17ఏళ్ళు ..అయినా వాడి పాడుబుద్ధి తెలిస్తే ..

17 Years Teenage hacker arrested

11:24 AM ON 30th June, 2016 By Mirchi Vilas

17 Years Teenage hacker arrested

రోజులు చాలా దారుణంగా ఉన్నాయని ఎవరికి వారే అనుకోవడం తప్ప నివారణకు ఎవరూ ప్రయత్నించడం లేదు. చట్టాలు కూడా బలంగా లేవు. ఫలితంగా దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇక అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కూడా వెర్రి తలలు వేయిస్తోంది. పట్టుమని 20 ఏళ్ళు కూడా నిండని కుర్రాళ్ళు చేసే పనులకు అంతూ పొంతూ ఉండడం లేదు. తాజాగా మూతిపై మీసాలు రాని ఓ 17 ఏళ్ల కుర్రాడు ఏకంగా మోడల్స్ కు గాలం వేశాడట. నకిలీ అకౌంట్స్ తో మోడల్స్ ఫోటోలు సేకరించి మళ్లీ వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఈక్రమంలో ఇప్పటికే రెండుసార్లు పోలీసులకు పెట్టుబడి, జైలు జీవితం అనుభవించినా, బుద్ధి మారలేదు 17 ఏళ్ల కుర్రోడైనా చేసిన పనికి ఎలాంటి ఆధారాల్లేకుండా ఇప్పటివరకు జాగ్రత్తపడుతూ వచ్చాడు. తన ఆనవాళ్లు తెలియకుండా వుండేందుకు నకిలీ ఆధారాలతో సిమ్ కార్డును వినియోగించేవాడు. ఈసారి ఏకంగా హైదరాబాద్ సిటీలోని ఓ మోడల్ పై కన్నేశాడు. ఆమె నుంచి 5 లక్షలు డిమాండ్ చేస్తూ అడ్డంగా సైబర్ క్రైమ్ పోలీసులకు దొరికిపోయాడు.. ఈ ఘటన విషయంలోకి వెళ్తే,

ఛత్తీస్ గఢ్ కు చెందిన ఈ కుర్రాడు.. ఓ మోడల్ కి సంబంధించిన జీ-మెయిల్, ఫేస్ బుక్, ఐ క్లౌడ్ అకౌంట్లలోకి చొరబడి అందులో కీలక సమాచారాన్ని దొంగిలించాడు. అంతేకాదు ఆమె తన భర్తతో ఏకాంతంగా గడిపిన వీడియో కూడా వుంది. ఆమెకు మోడలింగ్ పైగల ఆసక్తిని గుర్తించిన ఈ హాకర్, మలీషియన్ కోడ్ ను ఆమె ఖాతాలోకి పంపాడు.. ఈ వైరస్ ఆమె ఖాతాలోకి ప్రవేశించడంతో అందులోని వీడియోలు, ఫోటోలు దొంగిలించాడు. ఖాతాలోని వివరాల ఆధారంగా ఆమె సెల్ ఫోన్ తెలుసుకుని ఆమె ఏకాంత వీడియోలు, ఫోటోలను వాట్సప్ ద్వారా పంపాడు. తనకు 5 లక్షలు ఇవ్వాలని లేకపోతే వీటిని బహిర్గతం చేస్తాడని బెదిరించడం మొదలుపెట్టాడు.

అయితే ప్రస్తుతం బాధితురాలు తన భర్తతో కలిసి యూరప్ లో వుంటోంది. ఈ విషయాన్ని తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది. నిందితుడు ఉపయోగించిన ఫోన్ నెంబర్ పై ఆరాతీసినా డీటేల్స్ లభించలేదు. దీంతో పోలీసులు అత్యధిక సాంకేతిక టెక్నాలజీ అయిన రివర్స్ పుట్ ప్రింట్ ద్వారా నిందితుడి వినియోగించిన కంప్యూటర్ అడ్రస్ ను ట్రేస్ చేశారు. దీని ప్రకారం ఛత్తీస్ గఢ్ వెళ్లి యువ నిందితుడ్ని అరెస్ట్ చేసి సిటీకి తీసుకొచ్చి జువైనల్ బోర్డు ముందు హాజరుపరిచారు.

కుర్రోడి వయసు కేవలం 17 ఏళ్లైనా, ఇలాంటి సైబర్ క్రైమ్స్ చేయడంలో ఆరితేరిపోయాడు. గతంలో ముంబై, పూణె అడ్వర్జయిజింగ్ ఏజెన్సీల్లో పనిచేసిన అనుభవం గల ఇతగాడు, గత డిసెంబర్ లో ముంబైకి చెందిన ఓ మోడల్ ప్రైవసీ వీడియోలను దొంగిలించాడు. వాటిని తిరిగి ఆ మోడల్ కి పంపి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి, ఈ కేసులో అరెస్టన వాడ్ని జువైనల్ హోంకి తరలించారు. రిలీజైన తర్వాత పూణెలో మరో మోడల్ కి గాలం వేశాడు. ఇప్పుడు మూడోసారి హైదరాబాద్ మోడల్ కి గాలం వేసి సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. నెట్ వర్కింగ్ క్లౌడ్ స్టోరేజి సైట్లలో వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేసుకునేటప్పుడు వ్యక్తులు వేర్వేరు పాస్ వర్డులను వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. లేకపోతే ప్రమాదంలో పడతారని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: ప్రేక్షకుల మనసుని దోచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్స్(అప్పుడు - ఇప్పుడు)

ఇది కూడా చూడండి: రాత్రి పూట ఈ తప్పులు చెయ్యద్దు

ఇది కూడా చూడండి: ఇవి మీకు తెలుసా ?

English summary

17 Years Teenage hacker arrested for hacking model's social media accounts like facebook and whats app.