ప్రేమించినప్పుడు ప్రాణం ఇస్తాం అంటారు.. తీరా రేప్ చేస్తుంటే గుడ్లప్పగించి చూసారు: బాధితురాళ్లు

17 years two girls raped by 5 people in Delhi

04:11 PM ON 19th September, 2016 By Mirchi Vilas

17 years two girls raped by 5 people in Delhi

మీకోసమే మేమున్నామంటూ వెంట పడి తిరిగే బాయ్ ఫ్రెండ్స్, తీరా తమ గర్ల్ ఫ్రెండ్స్ కష్టాల్లో అందునా అత్యాచారానికి గురౌతుంటే గుడ్లప్పగించుకుంటూ చూసారా? అవునని సదరు బాధితులు అంటున్నారు. బాయ్ ఫ్రెండ్స్ గురించి బాధితులు పోలీసులకు చెప్పిన మాటలు సంచలనం రేపాయి. మాపై ఐదుగురు దుండగులు సామూహికంగా అత్యాచారం చేస్తుంటే, మాతో వచ్చిన మా బాయ్ ఫ్రెండ్స్ మౌన ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉన్నారు. వారు పెద్దగా అరచి మమ్మల్ని కాపాడుతారని మేం భావించామని, కాని వారు ఓ మూలన కూర్చొని తమపై సాగుతున్న దురాగతాన్ని చూస్తుండిపోయారు అని ఢిల్లీలోని అమన్ విహార్ గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితులైన 17, 18 ఏళ్ల బాలికలు పోలీసుల ముందు వాంగ్మూలమిచ్చారు.

1/4 Pages

ఓ బాయ్ ఫ్రెండ్ అయితే కనీసం తమపై జరిగిన దారుణ ఘటన గురించి పోలీసులకు సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించాడని బాధితులు ఆవేదనగా చెప్పారు. ఈ కేసులో నింధితులైన ఇద్దరు మైనర్ బాలురతోపాటు మనీష్(19), శివం(19)లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నింధితుడి కోసం పోలీసు పార్టీని రంగంలో దించారు. ఈ సంఘటన జరిగిన స్థలంలో గతంలో మూడు సంఘటనలు జరిగినా పోలీసులు కనీసం పెట్రోలింగ్ ఏర్పాట్లు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

English summary

17 years two girls raped by 5 people in Delhi