నిస్సహాయ స్థితిలో తల్లి.. అక్రమ సంబంధంతో కూతురి మృతి

17 years young lady suicide

03:04 PM ON 8th June, 2016 By Mirchi Vilas

17 years young lady suicide

అక్రమ సంబంధాలు కొంప ముంచుతాయని తెలిసినా ఇవి ఆగడం లేదు .. ఫలితంగా ప్రాణాల మీదికి వస్తోంది .. తాజాగా ఓ యువతి పెళ్లయిన యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిం చింది. వేధింపులు తాళలేక అవమానంతో ఆత్మహత్యకు పాల్పడింది. గుమ్మఘట్ట మండలంలోని బీటీపీ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 17 ఏళ్ల ఆశాబీ ఉసురుతీసుకుంది. ఉదయం విషయం తెలియగానే భయపడిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు పరిశీలిస్తే. ఆశాబీ, ఆమె తల్లి గోరీబీలు బీటీపీ గ్రామంలో కొన్నేళ్ల నుంచి నివాసముంటున్నా రు. యువతి తండ్రి 14 యేళ్ల క్రితమే తల్లిని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరే ఉంటున్నారు. ఈ క్రమంలో అదే గ్రా మానికి చెందిన బెస్త రఘు.. ఆశాబీతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు.

ఈ తతంగం రెండేళ్ల నుంచి కొనసాగుతుండగా, విషయం తెలిసిన బెస్త రఘు భార్య కవిత ఐదు నెలల క్రితమే విషద్రావకం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఎటువంటి కేసు లేకుండా రాజకీయ పలుకుబడితో రఘు బయటపడ్డాడు. పైగా ఆశాబీతో వివాహేతర సంబంధాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయం ఆశాబీ తల్లి గోరీబీకి తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆశాబీ ఇంటికెళ్లిన రఘుకు.. ఆమె ఇంట్లో లేక పోవడాన్ని గమనించాడు. పక్కనున్న తన మేనమామ ఇంటికెళ్లింది. ఆశాబీ ఇంటికి వచ్చిన వెంటనే ఆగ్రహంతో చితకబాదినట్లు తల్లి గోరీబీ ఆరోపిస్తోంది. దీన్ని అవమానంగా భావించిన యువతి విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితు రాలిని రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూసింది. కాగా యువతి మృతి చెందిందన్న విషయం తెలిసి ఆమెతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న బెస్త రఘు.. మంగళవారం ఉదయం విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే బెస్త రఘు అర్ధరాత్రి ఆశాబీని విచక్షణారహితంగా చితకబాది కొట్టి చంపాడని బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఫీజు కట్టలేక కూతురికి విషం ఇచ్చేసింది .. తానూ తాగేసింది ..

ఇది కూడా చూడండి: జూన్ 8న ఏం జరిగాయంటే ...

ఇది కూడా చూడండి: టాప్‌ హీరోయిన్స్‌ వారి సిస్టర్స్‌

English summary

Seventeen years young lady suicide.