తూర్పుగోదావరి, కొత్తపేటలో 18 అడుగుల అనకొండ కలకలం...

18 feet python in east godavari

06:42 PM ON 21st September, 2016 By Mirchi Vilas

18 feet python in east godavari

ఎక్కడో అడవిలో వుండాలిసిన అనకొండ జనం మీదకు వచ్చిందా అంటే అవుననే అంటున్నారు అక్కడి జనం. కానీ ఎంత వెతికినా ప్రస్తుతానికి దొరకకపోవడంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. కలకలం రేపుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట శివారు చినరాముడు నూతిమెరక గ్రామం, వాడపాలెం శివారు బండారుపేట పొలాల్లో అనకొండ సంచరిస్తోందన్న వార్త మంగళవారం సంచలనం రేపింది. దీనిపై పోలీసులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వగా, వారిద్వారా విషయం తెలుసుకుని ఫారెస్టు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు.

1/7 Pages

మేకలను మేపుతుంటే..


రైతు గంగుమళ్ల శ్రీరామచంద్రమూర్తి(కోరుమిల్లి కాపు) తన పొలం వద్ద మేకలను మేపుతున్నాడు. సోమవారం రాత్రి ఒక మేక అదృశ్యమైంది. మంగళవారం ఉదయం దాని కోసం గాలించగా, అనకొండ లాంటిది దీన్ని మింగేసిన ఆనవాళ్లు కనుగొని పెద్దపాము సంచరిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

English summary

18 feet python in east godavari. In East Godavari Distict, Kothapeta village a 18 feet python was came and gave shock to village people.