రద్దీ రద్దీ ...శ్రీవారి దర్శనానికి 18 గంటలు

18 Hours Time Foe Sarva Darshan

01:09 PM ON 28th May, 2016 By Mirchi Vilas

18 Hours Time Foe Sarva Darshan

నిన్నటి వరకూ అంతగా రద్దీ లేని తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడు రద్దీగా మారిపోయింది. వేసవి కాలం పైగా టిడిపి మహానాడు కూడా తిరుపతిలోనే కావడంతో రద్దీగా మారిపోయింది. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ లు అన్ని నిండిపోయి వెలుపల 4 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. దీంతో భక్తులను తిరువీధుల్లోని గ్యాలరీల్లోకి మళ్లిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజు కాలినడకన 42వేల మంది భక్తులు వచ్చినట్లు తితిదే అధికారులు తెలిపారు.

English summary

Tirumala Tirupathi was famous for Sri Lord Venkateswara Temple now it would take 18 hours time for sarwa darshan .