కాశ్మీర్‌లో 18 కి.మీ. సొరంగ మార్గం

18 kilometer road tunnel to Build in Kashmir

10:58 AM ON 16th February, 2016 By Mirchi Vilas

18 kilometer road tunnel to Build in Kashmir

జమ్మూకాశ్మీర్ లో 18 కిలోమీటర్ల సొరంగ రోడ్డు మార్గం నిర్మాణం జరగనుంది. కాశ్మీర్‌లోని గురెజ్ కేంద్రంగా ఈ మార్గాన్ని నిర్మించే ప్రతిపాదనను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఓ) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీనికి రూ. 9,000 కోట్లుగా వ్యయం కానుంది. బండిపొర జిల్లాలో ఉన్న గురెజ్‌లో శీతాకాలంలో కురిసే అత్యధిక మంచు కారణంగా మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ పరిస్థితిని నివారించి ఏడాది పొడవునా గురెజ్ లోయలోని మిగిలిన ప్రాంతాలన్నీ సంబంధాలు కలిగి ఉండేలా చేయాలన్నదే ఈ నిర్మాణం వెనుక ముఖ్య ఉద్దేశం. ఈ సొరంగ రోడ్డు మార్గం పొడవు 18 కి.మీ. కేంద్రం నుంచి దీనికి అనుమతి లభిస్తే దేశంలోనే పొడవైన సొరంగ రోడ్డు మార్గంగా ఇది రికార్డులకెక్కనుంది.

English summary

India plans to build its longest road tunnel in Kashmir.The Rs9,000-crore ($1.3 billion) project will connect the Gurez town in the northern part of the state of Jammu & Kashmir to the rest of the Kashmir Valley through an 18-kilometre road tunnel.