180 నాగుపాము పిల్లలు తప్పించుకున్నాయి... ప్రజల్లో భయం భయం

180 snakes escaped in China

11:22 AM ON 27th August, 2016 By Mirchi Vilas

180 snakes escaped in China

ఒక్క పాము కనిపిస్తేనే బెంబేలెత్తిపోతాం... ఏకంగా 180 పాములంటే వణికిపోక ఏమి చేస్తాం. సరిగ్గా అదే అక్కడ చోటుచేసుకుంది. పాముల పెంపక కేంద్రం నుంచి అత్యంత విషపూరితమైన 180 నాగుపాము పిల్లలు తప్పించుకొని పోవడంతో ఆ కేంద్రం పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలు చెందుతున్న ఘటన చైనా దేశంలో జరిగింది. చైనా వాయువ్య సిచువాన్ ప్రాంతంలోని ఓ పాముల పెంపకకేంద్రంలో నుంచి 180 నాగుపాము పిల్లలు తప్పించుకొని పోయాయట. తప్పించుకున్న నాగుపాము పిల్లలు ఎమిషాన్ నగరంలోని లుమూ టౌన్ షిప్ లో కనిపించాయని కొందరు ప్రజలు చెప్పినట్లు అటవీ శాఖాధికారులు అంటున్నారు.

సుమారు 16 నుంచి 27 సెంటీమీటర్ల పొడవున్న నాగుపాము పిల్లలు విషపూరితం కావడంతో అప్రమత్తమైన అధికారులు పాము పిల్లల పెంపక కేంద్రం చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలకు యాంటీ టాక్సిక్ సీరమ్ ను పంపిణీ చేశారు. తప్పించుకున్న పాము పిల్లల కోసం అటవీశాఖాధికారులు, అగ్నిమాపకశాఖాధికారులు గాలిస్తున్నారు. అయితే మొత్తం మీద 120 పాము పిల్లలను పట్టుకున్నామని, మరో 30 పాము పిల్లలను చంపివేశామని అధికారులు చెప్పారు. ఈ ఘటనతో ఈ పాము పిల్లల పెంపక కేంద్రంలో ఉన్న ఇతర పాములను సురక్షిత ప్రాంతానికి తరలించామని అధికారులు పేర్కొన్నారు. ఎన్ని చెప్పినా ప్రజల్లో భయం ఇంకా కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: నేను చేసిన ఆ ఫోటోలు బయటకు వచ్చాయో ఇక అంతే: రెజీనా

ఇది కూడా చదవండి: 2050కల్లా భూమిపై ఎంత మంది ఉంటారో తెలుసా?

ఇది కూడా చదవండి: మనం పాటించే సంప్రదాయాలు వెనకున్న సైంటిఫిక్ రీజన్స్ తెలిస్తే ఇక అవే ఫాలో అవుతారు!

English summary

180 snakes escaped in China. In China 180 small snakes escaped.