'బిగ్ బి'  ట్విట్టర్‌ లోనూ 'టాపే'

19 Million Followers For Amitabh On Twitter

12:23 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

19 Million Followers For Amitabh On Twitter

బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌బచ్చన్‌ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా టాప్ గా వున్నారు. ట్విట్టర్‌లో తన హవా కొనసాగిస్తున్నారు. ట్విట్టర్‌ లో ఆయనకు ఫాలోవర్ల సంఖ్య 1.9కోట్ల(19మిలియన్ల)కు చేరి పోయింది. దీంతో పలువురు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్‌ నటుల్లో అమితాబ్‌ మొదటి స్థానంలో ఉన్నారు.

ఇక మిగిలిలిన బాలీవుడ్ నటుల్లో షారుఖ్ ఖాన్ (17.5మిలియన్లు), ఆమీర్‌ఖాన్‌(16.2 మిలియన్లు), సల్మాన్‌ఖాన్‌ (15.8మిలియన్లు), ప్రియాంకచొప్రా 12.5మిలియన్ల ఫాలోవర్స్ ని కలిగివున్నారు. అమితాబ్‌ 2010 మేలో ట్విట్టర్‌ ఖాతాను తెరిచి, ఇప్పటి వరకూ 47,500 ట్వీట్లు చేశారు. బాలీవుడ్‌ తారలు శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌, దిలిప్‌కుమార్‌, నిర్మాత ముఖేశ్‌ భట్‌ తదితరులు ట్విట్టర్‌లో అమితాబ్‌ను అనుసరిస్తున్నారు. బిగ్ బి చేసే ట్వీట్ లకు వుండే ప్రత్యేకతే వేరు.

English summary

Bollywood Big B Amitabh Bachan was top in twitter he crosses 19 million mark followers. Soo many peolpe congratulated Amitabh in Twitter