మంచు తుపానుకు 19 మంది బలి

19 People Died In Snow Storm

12:58 PM ON 25th January, 2016 By Mirchi Vilas

19 People Died In Snow Storm

మంచు తుపాను అమెరికాను గజగజలాడిస్తోంది. దేశ తూర్పు ప్రాంతాన్ని మంచుదుప్పటి కప్పేసింది. యూఎస్ఏలోని పలు రాష్ర్టాల్లో మంచు తుపాను మొత్తం 19 మందిని బలితీసుకుంది. మంచు కారణంగా అర్కాన్‌సాస్, నార్త్ కరోలినా, కెంటకి, ఓహియో, టెన్నెస్సి, వర్జీనియా రాష్ర్టాల్లో జరిగిన కారు ప్రమాదాల్లో 13 మంది మృతిచెందారు. మేరీల్యాండ్‌లో ఒకరు, న్యూయార్కులో ముగ్గురు మంచు కారణంగా మరణించారు. వర్జీనియాలో హైపోథెర్మియా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంచు విఫరీతంగా రోడ్లపై పేరుకుపోవడంతో జనజీవనం స్తంభించింది. రాజధాని వాషింగ్టన్ నుంచి న్యూయార్కుకు అన్ని మార్గాలను మూసివేశారు. రోడ్లు, బ్రిడ్జిలు, టన్నెల్ మార్గాలను మూసివేశారు. న్యూయార్కులో రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది.

English summary

19 people were died Americas because of snow storm . This storm was the second highest snow storm in america history. Soo many people were gets illnesses due to this snow storm