ఆత్మహత్య చేసుకుంటూ ప్రత్యక్ష ప్రసారం చేసిన మహిళ(వీడియో)

19 years old girl gets suicide

03:20 PM ON 12th May, 2016 By Mirchi Vilas

19 years old girl gets suicide

అది దక్షిణ పారిస్ లోని ఇగ్లీ. అక్కడ ఓ సబర్బన్ రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే పెరిస్కోప్ యాప్ ద్వారా తన సూసైడ్ ను లైవ్ లో చిత్రీకరించింది. తను అత్యాచారానికి గురయ్యానని, అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని 19 ఏళ్ళ ఈ అమ్మాయి... ఫోన్ లో రికార్డు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ ను స్వాధీనం చేసుకుని వారు అందులోని వీడియోను పరిశీలించే పనిలో పడ్డారు. ఈ లైవ్ వీడియోని చూసినవారి వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఆ యువతి పేరు ఏమిటో తెలియనప్పటికీ.. తన పై రేప్ కు పాల్పడినవాడి పేరును ఆ వీడియో లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

పెరిస్కోప్ అన్నది యాప్ ట్విట్టర్ ఖాతా ద్వారా లైవ్ వీడియోలను అనుమతించే ఓ స్మార్ట్ ఫోన్ యాప్ అని పోలీసులు చెబుతున్నారు. లైవ్ వీడియోలు చూసేందుకు, వాటిని షేర్ చేయడానికి ఈ యాప్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని అంటున్నారు.


English summary

19 years old girl gets suicide