గ్రేటర్ లో నికరంగా1939 మంది....

1939 Members Nominations For GHMC Elections

05:41 PM ON 21st January, 2016 By Mirchi Vilas

1939 Members Nominations For GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పోరేషన్(జిహేచ్ ఎంసి) ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. ఇబ్బడి ముబ్బడిగా నామినేషన్లు వేసినప్పటికీ గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ఉపసంహరణకు ఈసీ ఇచ్చిన గడువు ముగిసే సమయానికి కొంతమంది వెనక్కు తగ్గారు.ఉపసంహరణ గడువు ముగిసేసరికి మొత్తం 150 డివిజన్లలో 1939 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా పార్టీల అగ్రనేతల బుజ్జగింపులతో చివరిరోజు 454 మంది తిరుగుబాటు నేతలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అభ్యర్థుల జాబితాను గుర్తులతో సహా రాత్రికి ఎన్నికల సంఘం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కొంతమంది నామినేషన్లు ఉపసంహరించు కున్నా, ఇంకా నామినేషన్లలో అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పలేదు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న బిజెపి -టిడిపిలకు రెబల్స్‌ బెడద వెంటాడుతోంది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించిన డివిజన్లలో మూడింటిలో బిజెపి తమ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చింది. ఇక టిడిపి కూడా బిజెపికి కేటాయించిన స్థానాల్లో ఐదింటిలో తమ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించింది. ఇదికాక రెబల్స్ బెడద ఇరుపార్టీలను ఇరకాటంలో పెడుతోంది. ఇక కాంగ్రెస్ , టి ఆర్ ఎస్ లకు కూడా రెబల్స్ బెడద ఉందనే ఉంది.

ఉపసంహరణ ఘట్టం ముగిసి, నికర అభ్యర్ధులు తేలడంతో ఇక ప్రచార పర్వానికి అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రచారంలో ఎన్నెన్ని ఆరోపణలు , ప్రత్యారోపణ లో ఉంటాయో ఇక చెప్పక్కర్లేదు.

English summary

Total 1939 Members were send their Nominations For GHMC Elections which were going to be started in February 2nd .