ఐఫోన్ యూజర్లకు 1970 బగ్ టెన్షన్

1970 bug Tension for iPhone users

10:26 AM ON 16th February, 2016 By Mirchi Vilas

1970 bug Tension for iPhone users

మీరు యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ వాడుతున్నారా..? 1970 జనవరి 1తో మీ ఫోన్‌లో డేట్ మార్చి రీబూట్‌ చేశారా..? అయితే ఇక అంతే సంగతులు. ఎందుకంటే ఈ డేట్ సెట్ చేస్తే మీ ఫోన్‌ బ్రిక్‌ అవుతుంది. ఇలా బ్రిక్‌ అయిన ఫోన్‌ను రీస్టోర్‌ చెయ్యడానికి రిపేర్‌ చేయడానికి అవకాశాలు లేవు. 64 బిట్‌ వెర్షన్‌ కలిగిన ఐఓస్‌ 8, ఐఓస్‌ 9, ఐఫోన్‌ 5ఎస్‌ తదుపరి మోడళ్లు, ఐపాడ్‌ ఎయిర్‌, ఐపాడ్‌ మినీ 2, 2015లో విడుదలైన 6వ తరం ఐపాడ్‌ టచ్‌ మోడళ్లలో మాత్రమే ఈ బగ్‌ను కనుగొన్నారు. 1970 జనవరి 1 తేది సెట్టింగ్‌లో జీరో లేదా అంతకంటే తక్కువ విలువ కలిగి ఉండడం ద్వారా టైమ్‌ స్టాంపింగ్‌లో లోపంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనికి కచ్చితమైన కారణం తెలియలేదని, దీనిని పరీక్షిస్తున్నామని యాపిల్ వెల్లడించింది. పబ్లిక్‌ వైఫైను ఉపయోగించే సమయంలో హ్యకర్‌ ఫోన్లలోకి ప్రవేశించి తేదీని మార్చడం ద్వారా ఫోన్‌ను బ్రిక్‌ చేసే అవకాశం ఉంది. బగ్‌ను పరిష్కరించే వరకు పబ్లిక్‌ వైఫైకి దూరంగా ఉండడం మంచిదని యాపిల్ చెపుతోంది.

English summary

1970 bug that is harassing Apple users worldwide. No minor trouble this: the bug can render your iOS device useless. After users began complaining about the glitch last week, Apple said it was working on a solution and would take care of the bug in its next iOS update.