బస్సులోనే జిమ్ - ప్రయాణంలోనే వ్యాయామం

1Rebel Buses Helps To Do Gym On Bus

11:34 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

1Rebel Buses Helps To Do Gym On Bus

ఈ యాంత్రిక యుగంలో అన్నీ తొందరే, ఏ పని చేయాలన్నా అసలు టైం వుండదు. ఇక ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది తమ వ్యక్తిగత అవసరాలకు.. ఆరోగ్యానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు పొద్దుట్నుంచి.. సాయంత్రం దాకా ఆఫీసు పనులు.. రాత్రులు పార్టీలు అంటూ.. అర్థరాత్రి దాటాక పడుకోవడం.. పొద్దునే లేచి మళ్లీ ఆఫీసుకు పరుగు అందుకోవడం, దీంతో ఆరోగ్యానికి ఉపయోగపడే యోగాలు.. వ్యాయామం చేసే తీరిక జనాలకు లేదనే చెప్పాలి. అందుకే ఓ సంస్థ విన్నూతంగా.. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయంలోనే బస్సుల్లో వ్యాయామం చేసేట్టుగా జిమ్‌ బస్సుల్ని రూపొందించింది.

ఇవి కూడా చదవండి:స్కూల్ బాత్రూంలో 25 మందితో సెక్స్ చేసిన స్టూడెంట్

లండన్‌కి చెందిన ‘1 రెబల్‌’ అనే ఫిట్‌నెస్‌ సంస్థ ఈ జిమ్‌ బస్సుల్ని రూపొందించింది. ఈ బస్సులో జిమ్‌లో ఉండే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. దీంతో జిమ్‌కి వెళ్లి ఎక్సర్‌సైజ్‌ చేసేంత సమయం లేని ఉద్యోగులు ఆఫీసుకు వెళ్తూనే జిమ్‌ చేయొచ్చు.

రోజువారీ పనులు చేసుకుంటూనే.. ఖాళీగా ప్రయాణించే సమయంలోనే ఆరోగ్యవంతమైన జీవితం పొందడానికి ఈ జిమ్‌ బస్సులు ఉపయోగపడతాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే లండన్‌లోని ప్రధాన రూట్లలో ఈ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. ఇంతకీ ఈ బస్సులో 45 నిమిషాల ప్రయాణానికి 12 నుంచి 15 పౌండ్లు ఛార్జ్‌ చేస్తారట.

ఇవి కూడా చదవండి:క్రిస్ గేల్ కు సెక్స్ తప్ప మరో ఆలోచన ఉండదట!

English summary

A New Buses launched by famous 1 Rebel Gym Company that we can do gym on going Bus. The company said that they were going to launch these buses in London very soon.