ప్రూఫ్స్ లేకుండా పెద్ద మొత్తంలో నోట్లు ఇచ్చేసారు.. ఆతర్వాత ఏమైందంటే..

2 bank employees stolen 6 lakhs from bank

11:02 AM ON 14th November, 2016 By Mirchi Vilas

2 bank employees stolen 6 lakhs from bank

పాత నోట్ల రద్దు కారణంగా సామాన్య జనం పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. నోట్ల కోసం జనం నానా పాట్లు పడుతున్నారు. బ్యాంకుల ముందు గంటల తరబడి నిల్చొని నీరసంతో సొమ్మసిల్లిపోతున్నారు. అయితే కొందరు బ్యాంకు ఉద్యోగులు తమ స్వలాభం కోసం ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారు. జనానికి 2వేలు ఇవ్వడానికే విసుక్కుంటున్న ఈ తరుణంలో ఎలాంటి ఫ్రూఫ్స్ లేకుండా 6లక్షల రూపాయల కొత్త నోట్లను బ్యాంకు ఉద్యోగి బొక్కేశాడు. హైద్రాబాద్ లోని సరూర్ నగర్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను యాజమాన్యం సస్పెండ్ చేసింది. వారిద్దరిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

1/5 Pages

సరూర్ నగర్ పరిధిలోని ఓ ప్రముఖ బ్యాంకులో వి.మహేష్ క్లర్క్ గా, రాధిక అనే మహిళ క్యాషియర్ గా పనిచేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులమే కదా ఏది చేసిన చెల్లుతుందనుకున్నారో ఏమో, ఎలాంటి ఫూఫ్ర్ లేకుండా 6లక్షల రూపాయల విలువైన నోట్లను రాధిక మల్లేష్ కు ఇచ్చింది. బ్యాంకు మేనేజర్ చేసిన తనిఖీల్లో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు మల్లేష్ దగ్గర్నుంచి 5.6లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

English summary

2 bank employees stolen 6 lakhs from bank