ఇద్దరు కుర్రాళ్ళు టీవీ ఆర్టిస్టులను బైక్ పై ఇంటికి చేరుస్తామని ఏం చేశారో తెలుసా?

2 boys robbed from a tv artisits

12:38 PM ON 5th December, 2016 By Mirchi Vilas

2 boys robbed from a tv artisits

నేరాలు ఎక్కడికక్కడ పడగ విప్పుతుంటే, దొంగతనాలు, దోపిడీలు కూడా పెచ్చుమీరాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ టీవీ ఆర్టిస్టుపైన, ఆమె సోదరిపైన దౌర్జన్యం చేసి వారిని దోచుకున్న అయిదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో జీహెచ్ఎంసిలో కాంట్రాక్టుపై పని చేస్తున్న శానిటరీ సూపర్ వైజర్, ఓ విద్యార్ధి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ధనశ్రీ అనే టీవీ ఆర్టిస్టు, ఆమె సోదరి శ్రీలత ఇటీవల బేగంపేట నుంచి తమ ఇంటికి స్కూటీపై వెళ్తుండగా.. యూసఫ్ గూడ వద్ద వారి వాహనం రాయి తగిలి పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి.

1/3 Pages

అటు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఇది చూసి వారిని తమ వాహనంపై ఇళ్ళకు చేరుస్తామని నమ్మబలికి వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుపోయారు. అక్కడ వారిని బెదిరించి వారి దగ్గరున్న బంగారు చైను, మొబైల్ ఫోన్ మొదలైనవాటిని తీసుకుని పారిపోయారు.

English summary

2 boys robbed from a tv artisits