కన్నతల్లి శవాన్ని 9నెలలు ఇంట్లోనే దాచిన కసాయి కొడుకులు..

2 brutal sons kept mother dead body in home

12:33 PM ON 14th September, 2016 By Mirchi Vilas

2 brutal sons kept mother dead body in home

కన్నతల్లి నవమాసాలు మోసి, కని, పెంచి పిల్లల బాగు కోరుకుంటుంది. బిడ్డలు క్షేమంగా ఉండాలని అనుక్షణం పరితపిస్తుంటుంది. అలాంటి తల్లి రుణం ఏం చేసినా తీర్చుకోలేం. కానీ పశ్చిమ బెంగాల్ లోని ఈ కసాయి కొడుకులు మాత్రం కన్నతల్లి నవమాసాలు మోసిన రుణాన్ని ఆమె మృతదేహాన్ని నవమాసాలు దాచి తీరిపోయిందనుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని అరుణ్ సాహా(65), అజిత్ సాహా(55) అన్నదమ్ములు. వారిద్దరికీ పెళ్లి కాలేదు. వారి అమ్మ నాని బాలా సాహా(85) జనవరి 16వ తేదీన చనిపోయింది. అయితే ఆమె మృతదేహాన్ని వీరిద్దరూ శ్మశానవాటికకు తీసుకెళ్లలేదు. అంత్యక్రియలు చేయలేదు.

ఇలా ఒకటి కాదు, రెండు కాదు... దాదాపు 9నెలలు తల్లి శవాన్ని ఇంట్లో మంచం మీద ఉంచారు. ఇరుగుపొరుగు వారితో కూడా వీరు అంత సన్నిహితంగా ఉండేవారు కాదు. ఎప్పుడో ఏదో లోకంలో ఉండేవారని స్థానికులు చెప్పారు. ఇంట్లోకి ఎవరినీ రానిచ్చే వారు కాదు. కొద్దిరోజుల క్రితం ఇంటి పక్కన ఉన్న వారు తల్లి ఆరోగ్యం గురించి ఆరా తీయగా ఆమె జబ్బుతో బాధపడుతోందని, విశ్రాంతి తీసుకుంటుందని చెప్పేవారు. ఈ మధ్య సర్వే చేయడానికి ఓ వ్యక్తి ఇంటికెళ్లాడు. ఇంట్లో ఉన్న అందరి లెక్కలు తీసుకుంటూ, వివరాలు అడిగాడు. వారి అమ్మగారిని చూపించమని అడిగితే అతనిని పంపించి, తలుపులు మూసేశారు.

దీంతో అనుమానమొచ్చిన అతను, మరో ఆరుగురితో కలిసి ఇంట్లోకెళ్లి చూడగా ఓ చీకటి గదిలో మంచంపై 85 సంవత్సరాల బాలాసాహా మృతదేహం కనిపించింది. ఆ మృతదేహాన్ని చూసిన స్థానికులు అవాక్కయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఆ ఇద్దరు అన్నదమ్ములను విచారించారు. వారిలో పెద్ద కొడుకు మాట్లాడుతూ చనిపోయిన కొద్దిరోజులకు అంత్యక్రియలు చేద్దామనుకున్నామని, కానీ అప్పటికే దేహం చేత్తో పట్టుకోవడానికి వీల్లేకుండా పాడైపోయిందని తెలిపాడు. ఈ అన్నదమ్ములిద్దరి మానసిక స్థితి సరిగాలేదని పోలీసులు తెలిపారు.

ఆమె పెద్ద కొడుకు గతంలో ట్యూటర్ గా పనిచేశాడని చెప్పారు. వీరి ఇల్లు మెయిన్ రోడ్ కు చాలా దూరంగా ఉండటంతో ఇన్నాళ్లు ఈ విషయం వెలుగులోకి రాలేదని తెలిపారు. ఆమెను వీరే చంపేశారా లేక అనారోగ్యంతో మరణించిందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: అన్ని విమానాలకు తెలుపు రంగే ఎందుకు వేస్తారో తెలుసా?

ఇది కూడా చదవండి: ఈ 'బాహుబలి' దున్నపోతుని చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇది కూడా చదవండి: అశోక వనంలో రాక్షసుల్ని సంహరించి హనుమంతుడు చెప్పిన జయ మంత్రము

English summary

2 brutal sons kept mother dead body in home. In West Bengal two brutal sons kept mother dead body in home till 9 months.