రెండు కోట్ల ఇల్లుని చీప్ గా అమ్మేసింది ... కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

2 crore rupees property sold for just Rs.168

11:28 AM ON 1st February, 2017 By Mirchi Vilas

2 crore rupees property sold for just Rs.168

కొనబోతే కొరివి , అమ్మబోతే అడవి అనే సామెత వుందికదా. దీనర్ధం మనం ఏదైనా కొనాలంటే ఎక్కువ ధర పెట్టాల్సిందే. అదే మన దగ్గర వుండే వాటిని అమ్ముదామంటే ధర చాలా తక్కువ పలుకుతుంది. ఇదే తరహాలో బ్రిటన్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న43 ఏళ్ల భారతీయ మహిళ రూ.2 కోట్లకు పైగా విలువ చేసే భూమిని కేవలం 2 పౌండ్లు ( భారత కరెన్సీలో రూ.168)కే అమ్మేశారు. ఎందుకింత చిత్రంగా చేసిందని వివరాల్లోకి వెళ్తే, దీని వెనుక చాలా తెలివైన కథ ఉందని తేలింది. సిమండ్లీ అనే గ్రామంలో రేఖ పటేల్ గత ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. 2010లో 2 లక్షల పౌండ్లు ఖర్చుపెట్టి (మన కరెన్సీలో 1.68 కోట్లు) ఆమె ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఇల్లు కొన్నప్పుడు కొన్ని రిపేర్లు చేపిస్తుంటే పొరపాటున పక్కింటి పైకప్పు గోపురం రాళ్లు దెబ్బతిన్నాయి. అంతే ఆ పక్కింటామే రేఖను గత ఆరేళ్లుగా నిద్రపోనివ్వలేదు. కోర్టులో కేసు వేసి ముప్పతిప్పలు పెట్టింది. దీంతో కోర్టు ఖర్చులతో పాటు పక్కింటామెకు నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పింది. సగం మేర చెల్లించిన రేఖ... మిగతా మొత్తం చెల్లించకపోవడంతో గొడవ మళ్లీ మొదటికి వచ్చింది. చివరికి కోర్టు రేఖ ఇంటిని అమ్మి 76 వేల పౌండ్లు నష్టపరిహారం రాబట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో చట్టం ప్రకారం కోర్టు తన ఇంటిని స్వాధీనం చేసుకునే అవకాశం లేకుండా రేఖ తన ఇంటిని రెండు కంపెనీలకు అమ్మేశారు. అదికూడా రెండు పౌండ్లకే! అక్కడి మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ ఇంటి విలువ 2,50000 పౌండ్లు. మళ్లీ తిరిగి అదే ఇంట్లో పదేళ్లపాటు నెలకు 50 పౌండ్లు కట్టి నివాసం ఉండేట్టు అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. బ్రిటన్ చట్టాల ప్రకారం ఇంటి యజమాని కంటే అద్దెదారులకే ఎక్కువ అధికారాలుంటాయని చెబుతున్నారు రేఖ. తన ఇంటిని కాపాడుకునేందుకు అమ్మడం మినహా మరో దారి కనిపించలేదనీ... న్యాయవ్యవస్థ అందరికీ సమాన న్యాయం చేయాలని రేఖ పేర్కొన్నారు. త్వరలోనే ఇండియాకి తిరిగి వచ్చి... ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితులకు అండగా ఉండేలా ఓ పుస్తకాన్ని రచించనున్నట్టు పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి: అవును మండపానికి పెళ్లికూతురు ఇలా వచ్చింది

ఇది కూడా చూడండి: వావ్ , చాక్లెట్ బిళ్ల ... ఇలా కరుగుతోందేంటి?

English summary

London women sold her 2 crore rupees property for just 168 rupees only.