పాటకి 2.5 కోట్లు ఖర్చా !

2 crores Spend For Song In Sarainodu

03:48 PM ON 17th February, 2016 By Mirchi Vilas

2 crores Spend For Song In Sarainodu

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సన్‌/ఆఫ్. సత్యమూర్తి, రుద్రమదేవి చిత్రాల తరువాత నటిస్తున్న చిత్రం 'సరైనోడు'. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబందించి ఒక వార్త హల్‌చల్‌ చేస్తుంది. అదేంటంటే ఈ చిత్రంలో టైటిల్‌ సాంగ్‌ కోసం దాదాపు 2.5 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇప్పటి వరకు తెలుగులో ఒక్కపాట కోసం ఇంత ఖర్చు చేసింది ఈ సినిమాకే. ఈ చిత్రంలో టైటిల్‌ సాంగ్‌ సెట్‌కి 1.5 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ఈ పాట చిత్రీకరణకి 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారట. అంటే దాదాపు ఈ పాటకి 2.5 కోట్లు ఖర్చువుతుంది మాట. బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ బోస్కో ఆధ్వర్యంలో 300 మంది డ్యాన్సర్లతో ఈ పాటని చిత్రీకరిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్‌ లో విడుదలవబోతుంది. ఈ చిత్రం టీజర్‌ను ఫిబ్రవరి 18 న విడుదల చేస్తున్నారు.

English summary

After the hit of Son of Satyamurthy and Rudrama Devi movies Stylish Star Allu Arjun was acting under the Direction Of Boyapati Serinu in Sarainodu movie.In this movie the sarainodu movie team has spend 1.5 crore for title song and another 1 crore for other song.This movie was producing by Geetha Arts.