31 సెకండ్స్.. 2.2 లక్షల ఆర్డర్లు

2 lakh orders in just 31 seconds for Le 1S

10:58 AM ON 17th February, 2016 By Mirchi Vilas

2 lakh orders in just 31 seconds for Le 1S

లీఎకో.. చైనాకకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ. ఈ కంపెనీ ఇటీవలే లీ వన్ ఎస్ పేరిట సరికొత్త మొబైల్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే ప్రముఖ ఆన్ లైన్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫ్లాష్ సేల్ రూపంలో ఈ ఫోన్లను అమ్ముతోంది. అయితే మూడో ఫ్లాష్ సేల్ లో ఈ కంపెనీ రికార్డులు బద్దలుకొట్టింది. కేవలం 31 సెకన్లలోనే సుమారు 2,20,000 ల స్మార్ట్ ఫోన్ల కోసం ఆర్డర్లు వచ్చాయట. ఫుల్ మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొదలైన ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ రూ. 10,999కే అందుబాటులో ఉంది. మంగళవారం నాటి ఈ ఫ్లాష్ సేల్ కోసం సుమారు 20,28,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలైన 31 సెకన్లలోనే 2,20,000 ఆర్డర్లను సంస్థ దక్కించుకుంది. వీటిని ఈ వారంలోనే వినియోగదారులకు డెలివరీ చేయనుంది. ఈ విషయాన్ని లీ ఎకో తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. తమకు పూర్తి సపోర్ట్ గా నిలిచిన వినియోగదారులకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది.

English summary

Chinese mobile company Le Eco was recently launched its smartphone called Le 1s in India and recently this company selled 2.2 lakhs of smart phones in just 31 seconds in the flipkart flash sale.