ఛీ.. భార్యలను వదిలేసి కాపురం పెట్టేసిన తోడల్లుళ్లు.. ఆపై..

2 men living together

11:10 AM ON 17th October, 2016 By Mirchi Vilas

2 men living together

రానురాను కొందరి ఆలోచనలు రోజురోజుకూ వికృతంగా తయారవుతున్నాయి. అవి వింత పోకడలకు, వికృత చేష్టలకు కారణమవుతున్నాయి. ఈ ఆలోచనలు వెర్రితలలు వేస్తే, ఆ తర్వాత తలెత్తే పరిణామాలు ఊహించడానికే భయంకరంగా ఉంటాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. ఇలాంటి అరుదైన ఘటనలు నూటికో, కోటికో ఒకటి జరుగుతుందేమో. ఇద్దరు మగాళ్లు కలిసి బతకడం కోసం వారి భార్యలను వదిలేశారు. ఇద్దరూ కలిసి ఒకే ఇల్లు తీసుకుని జీవిస్తున్నారు. భర్తలు తీసుకున్న వింత నిర్ణయంతో ఆ ఇద్దరు భార్యలు కోర్టుకెక్కారు. ఇక్కడ మరో విచిత్రమేంటంటే ఆ మహిళలిద్దరూ అక్కాచెల్లెళ్లూ... ఆ మగాళ్లిద్దరూ తోడల్లుళ్లు. 2010లో ఆ కుటుంబంలోని పెద్దమ్మాయికి పెళ్లయింది.

వారికో బాబు కూడా పుట్టాడు. 2013లో ఆమె చెల్లికి పెళ్లయింది. పెద్దల్లుడు మరదలి భర్తతో సన్నిహితంగా మెలిగేవాడు. అల్లుళ్లు ఇద్దరూ కలుపుగోలుతనంతో ఉన్నారనుకుని అందరూ భ్రమపడ్డారు. కానీ విడదీయలేనంత దగ్గరయ్యారని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇంకేముంది, వీరి విచిత్ర బంధం భార్యలను వదిలేసేదాకా వెళ్లింది. ఇద్దరూ కట్టుకున్న భార్యలను వదిలేసి సంవత్సరంన్నర నుంచి వేరు కాపురం పెట్టారు. ఈ పరిణామంతో కంగుతిన్న ఆ అక్కాచెల్లెళ్లు భర్తల యవ్వారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ స్టేషన్ లో కూడా వీరికి చుక్కెదురైంది. వారిద్దరిని విడిగా ఉండమని చెప్పే హక్కు చట్టప్రకారం లేదని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పడానికి మాత్రమే అవకాశం ఉందని పోలీసులు తేల్చి చెప్పారు.

దీంతో వారిద్దరూ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. తమ భర్తలు హింసిస్తున్నారని, నిర్లక్ష్యం చేస్తున్నారని గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇటీవల విచారణకొచ్చింది. కోర్టు కూడా ఆ ఇద్దరు మహిళలను పోషించేందుకు అవసరమయ్యే ఖర్చులను చెల్లించాలని భర్తలను ఆదేశించింది. కేసును నవంబర్ 19కి వాయిదా వేసింది. చూద్దాం కోర్టు ఏం తీర్పు చెబుతుందో!

English summary

2 men living together