బన్నీకి-ఆదికి గొడవెందుకు?

2 reasons for Stir between Allu Arjun and Aadi Pinisetty

12:46 PM ON 9th March, 2016 By Mirchi Vilas

2 reasons for Stir between Allu Arjun and Aadi Pinisetty

రుద్రమదేవి, సన్‌ఆఫ్‌ సత్యమూర్తి వంటి విజయాలు తరువాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సరైనోడు'. మాస్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేధరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తుండగా గీతా ఆర్ట్స్‌ పతాకం పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బన్నీకి విలన్‌గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఇందులో ఆదిని బోయపాటి శ్రీను ఎంతో పవర్‌ఫుల్‌ విలన్‌గా చూపిస్తున్నారట. అసలు ఈ చిత్రంలో బన్నీకి-ఆదికి వైరం ఎలా మొదలౌతుందో ఆ విషయం బయటకొచ్చింది.

ఇందులో ఆది హోమ్‌ మినిస్టర్‌ కొడుకుగా కనిపించనున్నాడట. అయితే బన్నీకి-ఆదికి గొడవ అవ్వడానికి కారణాలు రెండున్నాయట. ఒకటి ఈ చిత్రం హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ని ఆది పెళ్ళి చేసుకోవాలనుకుంటాడట. రెండు తన పొలిటికల్‌ భవిష్యత్‌ కోసం మరో హీరోయిన్‌ కేధరిన్‌ త్రెసాని చంపుదామనుకుంటాడట. కేధరిన్‌ ని రక్షించేందుకు బన్నీ ఆదితో తలపడతాడట. అందుకే బన్నీకి-ఆదికి గొడవ. ఈ చిత్రంలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్‌ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

English summary

2 reasons for Stir between Allu Arjun and Aadi Pinisetty. Aadi Pinisetty is acting in negative role in Allu Arjun Sarainodu movie. This movie is directing by Boyapati Sreenu.