దానికోసం 'రోబో 2.0'లో 20 కోట్లతో సెట్టా!

20 crores set for Robo 2.0 movie

04:43 PM ON 15th February, 2016 By Mirchi Vilas

20 crores set for Robo 2.0 movie

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి 'కబాలి' కాగా, ఇంకొకటి 'రోబో 2.0'. భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న 'రోబో 2.౦' చిత్రంలో రజనీకాంత్‌ సరసన బికినీ బ్యూటీ అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 250 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి అప్పుడే రెండు షెడ్యూల్స్‌ కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు తాజా షెడ్యూల్‌ కోసం ఒక భారీ సెట్‌ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 18 నుండి ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్‌ కోసం పూందమల్లి అనే గ్రామం సమీపంలో సుమారు 20 కోట్ల రూపాయలతో ఒక అత్యాధునిక నగరం రూపంలో బ్రహ్మాండమైన సెట్‌ వేశారు.

ఇందులో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తారట. అందుకోసం హాలీవుడ్‌ నుండి కెన్నీ పెట్స్‌ అనే స్పంట్‌ మాస్టర్‌ని శంకర్‌ 'రోబో 2.0' కోసం దిగుమతి చేసుకున్నాడు. కెన్నీ పెట్స్‌ ఇప్పటికే తన టీమ్‌తో ఈ సెట్‌లోకి వచ్చేసి యాక్షన్‌ సన్నివేశాలని కంపోజ్‌ చేస్తున్నాడని సమాచారం. మొత్తం మీద ఈ చిత్రాన్ని శంకర్‌ ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడని అర్ధమవుతుంది.

English summary

Super Star Rajinikanth upcoming movie Robo 2.0. This movie is directing by Shankar. For this movie they are building 20 crores set. Amy Jackson is romancing with Rajinikanth in this movie.