'కబాలి'కి 20లక్షలతో 50 వేల లీటర్ల పాలట!

20 Lakh Worth 50 Thousand Milk To Be Wasted For Kabali

11:43 AM ON 19th July, 2016 By Mirchi Vilas

20 Lakh Worth 50 Thousand Milk To Be Wasted For Kabali

తమిళనాట హీరో కటౌట్ కు పాలాభిషేకాలు చేయడం అనే కాన్సెప్ట్ సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమాలతోనే ఆరంభమైంది. అభిమానుల్లో ఏదో సరదాగా మొదలైన ఆ అలవాటు ఇప్పుడు మరీ విపరీతం అయింది. రజినీ సినిమా వస్తోందంటే చాలు.. వేలకు వేల లీటర్ల పాలు వృథా అయి పోతున్నాయి. ఓ పక్క కొందరు అభాగ్యులు ఆకలితో అల్లాడుతుంటే.. ఇంకో పక్క ఇలా లక్షల రూపాయల విలువ చేసే పాలు వృథాగా నేలలో కలిపేస్తున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక రజినీ కొత్త సినిమా కబాలి విషయానికి వస్తే.. ఈ సినిమా విడుదల రోజు కటౌట్లకు అభిషేకం చేయడానికి రూ.20 లక్షల విలువ చేసే 50 వేల లీటర్ల పాలు వృథా కాబోతున్నట్లు తమిళనాడు పాల వ్యాపారుల సంఘం అంచనా వేసింది. తమిళనాడులో 15శాతం మంది రోజూ పాలుకొనేందుకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పాలు ఇలా వృథా చేయడం సబబా అని ఆ సంఘం ప్రశ్నించింది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే రజినీ అభిమానులు ఈ దురాచారం మానుకోవాలంటూ కబాలి విడుదల ముందు ఆ సంఘం ఓ ప్రకటన ఇచ్చింది.

అన్నామలై సినిమాలో రజినీ పాలవాడిగా నటించినప్పట్నుంచి అభిమానులు ఆయన కటౌట్ కు పాలాభిషేకాలు చేయడం మొదలుపెట్టారు. ఒకట్రెండు చోట్ల ఈ పద్ధతి మొదలై.. తర్వాత అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. మిగతా హీరోల అభిమానులు కూడా ఈ దుస్పంప్రదాయాన్ని అలవాటు చేసుకున్నారు. స్వయంగా రజినీనే తన అభిమానులకు ఈ విషయంలో ఓ పిలుపు ఇస్తే బాగుంటుందని, పలువురు అభిప్రాయపడుతున్నారు. కటౌట్ లకు అభిషేకం చేసేకన్నా, ఆ పాలను పంచి పెడితే మంచిదని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:రీ షూట్ కోరుతున్న కత్తిలాంటోడు - ఆగిపోయిన మూవీ షూటింగ్

ఇవి కూడా చదవండి:బల్లిని చంపితే... పాపం చుట్టుకుంటుందా?!

English summary

Super Star Rajinikanth's Kabali movie to be released on 22nd of this month and this movie was created hype with the Trailer and Songs and now Milk Association in Tamilnadu State said in a press meet that its About 20 lakh worth 50 Thousand Milk was going to be wasted for Rajinikanth Kabali movie.