మహేష్ తరువాత రానాదే సెకండ్ ప్లేస్!

20 lakhs followers for Rana

05:19 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

20 lakhs followers for Rana

ఇదేమిటి అనుకుంటున్నారా? ప్రస్తుతం రీల్ లైఫ్ లో రానా అంటే భల్లాలదేవ కదా. బాహుబలి కంక్లూజన్ లో బిజీ బిజీగా వున్నాడు. అయితే అతడి సైన్యం ఇప్పుడు 20 లక్షలు. అయితే ఇది మాత్రం ఆన్ స్క్రీన్ లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ బలమైన హీరోయే! ఇదంతా బాహుబలి 2 సినిమాలోని సన్నివేశం గురించి కానేకాదు. ఇక్కడ కండబలం గురించి అస్సలేకాదు.. ఫ్యాన్స్ సైన్యం. నిత్యం ఏదో ఒక ట్వీట్లతో అభిమానులకు అందుబాటులో వుండే రానా, తన ఫాలోవర్స్ సంఖ్య 20 లక్షలకు చేరింది. టాలీవుడ్ లో ఫ్యాన్స్ ఎక్కువమంది వున్న హీరోల్లో ఈయనది సెకండ్ ప్లేస్. సూపర్ స్టార్ మహేష్ బాబు 24 లక్షల మంది ఫాలోవర్స్ తో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. తన బలాన్ని పెంచి రెండో స్థానానికి చేర్చిన అభిమానులకు రానా థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ వదిలాడు.

English summary

20 lakhs followers for Rana