బస్సుల్లో లాస్ట్  సీట్లకు గోల్డెన్ ఆఫర్

20 Percent Discount For Last Seats In RTC Busses

12:27 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

20 Percent Discount For Last Seats In RTC Busses

బస్ టికెట్ల బుకింగ్స్ లో లాస్ట్ సీట్లో ప్రయాణించడానికి అనువైన వాతావరణం కల్పించే చర్యలు ఆర్టిసి చేపట్టింది. సాధారణంగా లాంగ్ జర్నీ చేసేవాళ్లు వెనుక సీట్లను అంతగా ఇష్టపడరు. తప్పదనుకుంటే తప్ప మిగిలిన సమయాల్లో దూరప్రయాణం చేసే బస్సుల్లో ఎక్కువశాతం వెనుకసీట్లు ఖాళీగానే ఉండిపోతుంటాయి. అయితే దీనికి ఆర్టిసి విరుగుడు కనిపెట్టింది. అదేమంటే, బస్లలోని వెనుక రెండు వరుసలలో ప్రయాణించే ప్రయాణీకులకు 20శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా ఆక్యుపెన్సీ రేటు పెంచవచ్చని ఆశిస్తోంది. 250 కిలో మీటర్లకు పైగా ప్రయాణించే డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, అమరావతి వంటి దూరప్రాంత సర్వీసులకు ఈ రాయితీ వర్తిస్తుంది. అడ్వాన్స్ రిజర్వేషన్‌తోపాటు కరెంట్ రిజర్వేషన్ చేయించుకున్నప్పుడూ ఇది అమల్లో ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ప్రకటించారు.

అంతేకాదు, 250 కిలోమీటర్లకు మించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినవారికి ఆ తర్వాత రెండుగంటలపాటు సమీప ప్రాంతాలకు సిటీబస్సులు, జిల్లా సర్వీసుల్లో (తెలుగు వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు) ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించాలని ఆర్టిసి నిర్ణయం తీసుకుంది. కాగా నిర్దిష్ట మొత్తం చెల్లించి పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు ఇలా ఎవరిపేరైనా బస్‌స్టేషన్లకు పెట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ అవకాశం వదాన్యులు వినియోగించుకుని ఆర్టిసి ఉన్నతికి బాటలు వేయాలని ఆర్టిసి ఎండి కోరారు. రాష్ట్రంలోని 40 రూట్లలోని 453 బస్సుల్లో అడ్వాన్స్ బస్ ఎరైవల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఆయా స్టేషన్లకు ఎదురు చూస్తున్న బస్సు ఎంతసేపట్లో వస్తుందో తెలుస్తుంది. అంతేకాదు, తమ సెల్‌ఫోన్లో మిస్‌డ్ కాల్ ఇస్తే బస్సులో అమర్చిన యంత్రం ద్వారా ప్రయాణికుడు ఉన్న స్టేషన్లో ఎనౌన్స్‌మెంట్ వస్తుంది.త్వరలోనే బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు లైవ్ ట్రాక్ (వెహికల్ ట్రాకింగ్)ను సైతం ప్రవేశపెడతారు. మొత్తానికి ఆర్టిసి వినూత్న ఆఫర్లతో బలోపేతం అవ్వడానికి ఇలా కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు.

English summary

Andhra Pradesh Road And Transport Corporation APSRTC had taken a forward step to increase busses occupancy.APSRTC MD Sambasiva Rao announced Last Seat occupants in RTC buses could avail 20 percent discount on the actual ticket price.He said that this scheme was going to be availabl;e from today onwards.