తన గ్రామం కోసం వెబ్‌సైట్‌ ను తయారుచేసిన యువకుడు 

20 Year Old Boy Creates Website To His Village

01:15 PM ON 30th December, 2015 By Mirchi Vilas

20 Year Old Boy Creates Website To His Village

రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని జైపూర్‌ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జత్వరకలన్‌ అనే గ్రామంకు ఆ గ్రామంలోని 20 ఏళ్ళ యువకుడు తనదైన రీతిలో సాయపడుతున్నాడు. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ విప్రోలో వెబ్‌ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్నఅతడు తను పుట్టిన గ్రామానికి ఏదో విధంగా సేవ చెయ్యాలన్న భావనతో తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసాడు హరి శంకర్‌ మీనా అనే 20 ఏళ్ళ యువకుడు.
తన గ్రామం పేరిట ఒక వెబ్‌సైట్‌ ను రూపొందింది. ఆ గ్రామానికి చెందిన ఓటర్ల లిస్ట్‌ను, హెల్త్‌ సెంటర్‌ డేటాను, పంటపొలాలకు అవసరమైన చిట్కాలను హిందీ మరియు ఇంగ్లీషు రెండు భాషలలోను డేటాను ఆ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాడు.

అంతేకాక ఆ గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ గ్రామానికి సంబంధించిన గవర్నమెంట్‌ అధికారులు వివరాలు,జిల్లా కలెక్టరు, గ్రామ పత్వారి, తహసిల్దారుల వంటి అనేక మంది ప్రజాప్రతినిధుల వివరాలను వారి ఫోన్‌ నంబర్లను ఆ సైట్‌లో అందుబాటులో ఉంచాడు.

జత్యరకలన్‌ గ్రామ పెద్ద భోగల్‌ చంద్‌ మీనా మాట్లాడుతూ ఈ వెబ్‌సైట్‌ గ్రామ ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతుందని, గ్రామంలో స్కూళ్ళ పరిస్థితి, విద్యార్దుల వివరాలు వంటివి చాలా ఉపయోగమైన సమాచారం ఆ వెబ్ సైట్లో ఉన్నాయని అన్నారు.

వెబ్‌సైట్‌ ను రూపొందించిన హరిశంకర్‌మీనాను ఆ గ్రామ ఎంఎల్‌ఏ తన నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలకు వెబ్‌సైట్‌ ను రూపొందించమని కోరారు. తన గ్రామానికి , గ్రామా ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతున్న హరిశంకర్‌ ను ఆయన పొగడ్తలతో ముంచెత్తారు.

English summary

20 Year Old Boy Creates Website To His Village. That website covers all the information about his village.