ఫేస్ బుక్ లోపాలు గుర్తించినందుకు ఈ అబ్బాయికి ఫేస్ బుక్ ఏమిచ్చిందో తెలుసా?

20 years student identified debug in Facebook

12:52 PM ON 20th September, 2016 By Mirchi Vilas

20 years student identified debug in Facebook

ఫేస్ బుక్ లో లోపాలను గుర్తించినవారికి పారితోషికం ఇచ్చే పథకం 2011లో ప్రారంభమైన నేపథ్యంలో, హ్యాకర్ అరుణ్ ఎస్ కుమార్ కు ఫేస్ బుక్ యాజమాన్యం నుండి ప్రశంసలు లభించాయి. ఫేస్ బుక్ కోడ్ లో లోపాలను నిర్ధారించినందుకు అరుణ్ కు రూ.10.70 లక్షలు పారితోషికం ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తనూర్ లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతున్న 20 ఏళ్ళ అరుణ్ మాట్లాడుతూ ఫేస్ బుక్ బిజినెస్ మేనేజర్ లో కీలకమైన లోపాన్ని గుర్తించానని చెప్పాడు. ఈ లోపం ద్వారా హ్యాకర్లు ఫేస్ బుక్ పేజీని 10 సెకన్లలోగా కంట్రోల్ లోకి తెచ్చుకొనే అవకాశం ఉందన్నాడు.

ఫేస్ బుక్ యూజర్లలో ఎవరి పేజీనైనా తారుమారు చేసేందుకు హ్యాకర్లకు ఈ లోపం వల్ల అవకాశం కలుగుతుందని, దానివల్ల జరిగే నష్టాన్ని ఊహించడం సాధ్యం కాదన్నారు. తాను ఈ లోపాన్ని గత నెల 29న గుర్తించి, వెంటనే ఫేస్ బుక్ సెక్యూరిటీ టీమ్ కు తెలియజేశానని చెప్పుకొచ్చాడు. ఆ మర్నాడే తనను ప్రశంసిస్తూ ఫేస్ బుక్ నుంచి తనకు లేఖ అందిందన్నాడు. ఈనెల 6న ఆ లోపాన్ని సవరించారని చెప్పాడు.

1/4 Pages

గత ఏడాది రూ 7 లక్షలు నజరానా...


అరుణ్ ఇటువంటి బగ్స్ ను కనిపెట్టడంలో దిట్ట. గూగుల్, ఫేస్ బుక్ లలో అనేక బగ్స్ ను గతంలో కూడా కనిపెట్టి, ప్రశంసలు పొందాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ లోపాన్ని గుర్తించినందుకు ఫేస్ బుక్ ఆయనకు రూ.7 లక్షలు బహుమతి ఇచ్చింది.

English summary

20 years student identified debug in Facebook. 20 years student Arun find the debug in Facebook. And complaints to facebook security officers. After that facebook recovered that issue and sent the mail to him. And facebook gave 10 lakhs prize money to Arun.