రూ. 200కోట్ల విలువైన పాము విషం స్వాధీనం!

200 crores snake poison was seized

12:05 PM ON 17th October, 2016 By Mirchi Vilas

200 crores snake poison was seized

పశ్చిమబంగాలో ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా రూ.200 కోట్ల విలువైన పాము విషాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరబంగాలోని సిలిగురి ప్రాంతంలో నలుగురు అనుమానితులు పాము విషాన్ని కంటైనర్లలో స్మగ్లింగ్ చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. వెంటనే బెలకోబా ఫారెస్ట్ రేంజ్ అధికారులు కొనుగోలుదారులుగా వారి వద్దకు వచ్చి ఎంత విషం అమ్ముతున్నారని ఆరా తీశారు. ఈ విషాన్ని ఎక్కువగా ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు స్వాధీనం చేసుకున్న విషం త్రాచుపాముగా తేలింది. దీన్ని చైనాకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని అధికారులు చెబుతున్నారు.

త్రాచుపాము విషం చైనా అంతర్జాతీయ మార్కెట్లలో మంచి గిరాకీ ఉందని దీనిని ఎక్కువగా నార్కోటిక్ డ్రగ్స్ లో వాడతారని పేర్కొన్నారు. బెల్జియం గాజుతో తయారు చేసిన ఐదు బుల్లెట్ ప్రూఫ్ కంటైనర్లలో ఆరు కిలోల విషం నింపినట్లు చెప్పడంతో వెంటనే కంటైనర్లు, నింధితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విషాన్ని ఫ్రాన్స్ నుంచి బంగ్లాదేశ్ ద్వారా సిలిగురికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. నింధితులు మాల్దాకి చెందిన సుజోయ్ కుమార్ దాస్, విపుల్ సర్కార్, పింటు బెనర్జీలుగా గుర్తించారు.

English summary

200 crores snake poison was seized