చైనాలో అసాంఘిక వెబ్ సైట్ల నిషేధం

200 Websites Banned In China

10:33 AM ON 6th February, 2016 By Mirchi Vilas

200 Websites Banned In China

అశ్లీలం, అక్రమ వ్యాపారం, ఉగ్రవాదం, మారణాయుధాల అక్రమ రవాణా తదితర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి 200 వెబ్‌సైట్లు, ఆరు వేల సామాజిక అనుసంధాన ఖాతాలను సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ చైనా నిషేధించినట్లు చైనా అంతర్జాల నిఘాసంస్థ తెలిపింది. వెబ్‌సైట్లను అక్కడ నిషేధించిన విషయాన్ని గ్లోబల్‌ టైమ్స్‌ మీడియా పేర్కొంది. నకిలీ ధ్రువపత్రాలతో విదేశీ విద్యాలయాల్లో విద్యార్థులను మోసంచేసే నకిలీ సంస్థల వెబ్‌సైట్లు, అనుమతుల్లేని స్టాక్‌ మార్కెట్‌ నిర్వహణల సైట్లను నిషేధించినట్లు అక్కడి మీడియా తెలిపింది. మొత్తానికి సోషల్ మీడియాలో కూడా నిషేధం పాళ్ళు హెచ్చడంతో చాలా వరకు అసాంఘిక శక్తులు తగ్గుముఖం పడతాయని అంటున్నారు.

English summary

The Cyberspace Administration of China banned 200 websites and some 6,000 accounts from various social media platforms in China.