సింగర్ పై కొత్త నోట్ల వర్షం కురిపించిన అభిమానులు(వీడియో)

2000 Currency Notes Showered on Gujarati Singer Kirtidan

02:13 PM ON 5th December, 2016 By Mirchi Vilas

2000 Currency Notes Showered on Gujarati Singer Kirtidan

ఓ పక్క పెద్ద నోట్ల రద్దుతో కొత్త నోట్లకు జనాలు నానా తంటాలు పడుతుంటే, రాజ్ కోట్ లో జరిగిన ఓ ప్రదర్శనలో పాల్గొన్న గాయకుడు కీర్తిధన్ పై రూ.2వేల నోట్ల వర్షం కురిసింది. గాయకులపై అభిమానంతో నోట్ల వర్షం కురిపించడం కొత్తకాకపోయినప్పటికీ పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో భారీగా రూ.2వేల నోట్లు చల్లడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగదు దొరకక ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ఇలా చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాయకుడు, నిర్వాహకులు ప్రస్తుత పరిస్థితిని విస్మరించడం సరికాదన్నారు.

నోట్ల కోసం ప్రజలు పెద్దఎత్తున బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరినా నగదు దొరకక నానా అవస్థలు పడుతుంటే.. ఇంతపెద్దమొత్తంలో వారికి రూ.2వేల కొత్తనోట్లు ఎలా వచ్చాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అభిమానం కాస్తా అనుమానానికి దారితీసింది.

English summary

2000 Currency Notes Showered on Gujarati Singer Kirtidan