గ్రేటర్ లో  2వేలకు పైగా  నామినేషన్లు

2000 Nominations For 150 Wards In GHMC

12:37 PM ON 18th January, 2016 By Mirchi Vilas

2000 Nominations For 150 Wards In GHMC

జిహెచ్ఎంసి ఎన్నికల కు సంబంధించి కీలకమైన నామినేషన్ల ఘట్టం ఆదివారం ముగిసింది. రెండు వేల నామినేషన్లు పైగా దాఖలయ్యాయి. గ్రేటర్ పరిధిలోని ఒక్కో డివిజన్‌కు పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 150 డివిజన్లకు రెండువేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు టి ఆర్ ఎస్ 143 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, ఇంకా ఏడు డివిజన్లలోఅభ్యర్థుల పేర్లను ఖారారు చేయాల్సి వుంది. కాంగ్రెస్ పార్టీ 94 డివిజన్లలో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టిడిపి - బిజెపి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం టిడిపి 87 స్థానాల్లో, బిజెపి 63స్థానాల్లో పోటీ చేస్తాయి. అయితే టిడిపి 82 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 5 కూడా సిద్ధం చేసారు. బీజేపీ పోటీచేసే 63 స్థానాల్లో అభ్యర్థులను ఇంకా ప్రకటించ కుండా, ఒక్కో డివిజన్ లో ముగ్గురు లేక నలుగురు చొప్పున అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది. మజ్లిస్ పార్టీ 75 స్థానాల్లో అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది. కాంగ్రెస్ పార్టీ కొందరికి ఫోన్ల ద్వారా సమాచారం అందించి నామినేషన్లు దాఖలు చేయించారు. దాదాపు ప్రతి స్థానంలోనూ స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

English summary

Almost 2000 Nominations were posrted for 150 wards in Greater Hyderabad Municipal Corporation Eelctions