షాకింగ్: 2వేల నోటు కూడా తాత్కాలికమేనట.. ఇంకా 50, 100నోట్లు కూడా..

2000 note is only temporary

11:03 AM ON 18th November, 2016 By Mirchi Vilas

2000 note is only temporary

చిన్న నోట్ల గురించి వస్తున్న పుకార్లను ప్రభుత్వం కొట్టిపారేసింది. రూ. 50, రూ. 100 నోట్లు రద్దుకావని స్పష్టం చేసింది. అసలు విషయం ఏమిటంటే, పెద్ద నోట్ల రద్దుతో చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? చిన్న నోట్లను కూడా రద్దు చేయాలని భావిస్తున్నారా? 50, 100 రూపాయల నోట్లను రద్దు చేసే అవకాశముందా? 50, 100 నోట్లను ప్రధాని రద్దు చేయబోతున్నారంటూ వాట్సాప్ లో ఓ మెసేజ్ హల్ చల్ చేస్తోంది. సహజంగానే ఈ వార్త విన్న సామాన్యుడి గుండె గుబేలుమంది. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లాయన్న విషయాన్ని గ్రహించిన సమాచార మంత్రిత్వ శాఖ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

వాట్సాప్ లో వస్తున్న ఆ వార్త పూర్తి అవాస్తవమని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులను ప్రజలు నమ్మొద్దని ప్రజలకు సూచించింది. అవన్నీ నిరాధారమని, ఇంతవరకూ 50, 100 రూపాయల నోట్లకు సంబంధించి ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

1/4 Pages

ఇక వెయ్యి నోటు రాదు...


అయితే ఐదొందలు... ఆపై ఏకంగా రెండు వేలు! మధ్యలో వెయ్యి రూపాయల నోటు కనిపించదు. సమీప భవిష్యత్తులో మళ్లీ వెయ్యి నోటును ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.

English summary

2000 note is only temporary