త్వరలో రెండు వేల రూపాయల నోటు రద్దు!

2000 Rupee Notes To Be Cancelled Soon

10:56 AM ON 13th December, 2016 By Mirchi Vilas

2000 Rupee Notes To Be Cancelled Soon

పెద్ద నోట్ల తర్వాత కొత్తగా రెండు వేల నోటు ప్రవేశపెట్టడం పలు విమర్శలకు దారితీసిన సంగతి తెల్సిందే. అసలు ఈనోటు వెనుక రహస్యం ఏమిటని పలువురు తలలు బద్దలు కొట్టుకుంటానన్నారు. అయితే ఈ నోటు కూడా ఉండదని కొందరు హింట్స్ ఇస్తున్నారు. అయితే దీన్ని బలపరుస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త, ఆర్ధిక నిపుణుడు ఎస్. గురుమూర్తి మాట్లాడారు. త్వరలో రెండువేల రూపాయల నోటు రద్దు అయిపోతుందని అయన చెప్పారు. కేవలం రద్దు చేసేందుకు రెండు వేల రూపాయల నోటు తీసుకొచ్చారని ఆయన అంటున్నారు. దేశంలో ఐదొందల నోటే అతి పెద్ద నోటుగా చెలామణిలో ఉంటుందని గురుమూర్తి స్పష్టం చేశారు. నిజానికి వచ్చే ఏడాది జూన్ నాటికే ఈ రెండు వేల రూపాయల నోటును చెలామణి నుంచి తొలగిస్తారని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పలు మీడియా సంస్థలు దీనికి సంబంధించి వార్తా కథనాలు కూడా ప్రచురించాయి. మరోవైపు ఇప్పటికే వెయ్యి రూపాయల నోటు కొత్త రూపంలో రానున్నట్లు సోషల్ మీడియాలో నమూనా నోట్లు దర్శనమిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గురుమూర్తి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇంతకీ అసలు ఏమి చేస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి: ఈమె నిజంగా అమ్మ కూతురేనా? ఫోటో వెనుక దాగిన అసలు రహస్యం ఇదే

ఇవి కూడా చదవండి: నవరాత్రి మినరల్ వాటర్ ఖర్చు రు. 10 కోట్లు .. మోడీయా మజాకా

English summary

Financial analyst S.Gurumurthy made some sensational comments on new 2000 rupee currency notes that government was going to cancel new 2000 rupee notes also. He said that Government has bought to reduce black money.