2వేల ఏళ్లనాటి బంగారు నాణెం

2000 Years Gold Coin Found In Israel

11:03 AM ON 15th March, 2016 By Mirchi Vilas

2000 Years Gold Coin Found In Israel

ఇది పురాతన కాలం నాటి ఓ అదుదైన బంగారు నాణెం. ఇజ్రాయెల్‌లో బయటపడిన ఈ నాణెం సుమారు 2వేల ఏళ్ల నాటిదని తేల్చారు. ఈ బంగారు నాణెం ఓ హైకర్‌కు దొరికింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ పురావస్తు శాఖ అధికారులు వెల్లడిస్తూ, ఇలాంటి పురాతన అరుదైన నాణెం దొరకడం ఇది రెండోసారి అని తెలిపారు. మొదటిది లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియంలో ఉందన్నారు. నాణెం 107ఏడీ నాటిదని, దానిపై రోమన్‌ మొదటి చక్రవర్తి అగస్తస్‌ చిత్రం ఉందని తెలిపారు . ఈ నాణెం రోమన్‌ సైనికులకు ఇచ్చే వేతనానికి చెంది ఉంటుందని పురావస్తు శాఖ అధికారులు విశ్లేషించారు.

English summary

Hiker found a rare Gold coin in Israel.The coin was a 2,000-year-old gold coin with the face of a Roman emperor, so rare that only one other such coin is known to exist.