ముంబాయి అల్లర్ల తరహాలోనే...

2008 Mumbai attacks are repeated in French

03:15 PM ON 14th November, 2015 By Mirchi Vilas

2008 Mumbai attacks are repeated in French

భారతావని యావత్ పీడకలగా భావించే ముంబాయి అల్లర్లను యధాతధాంగా అమలు చేసి పారిస్లోనూ ఉగ్రవాదులు చెలరేగినట్లు అమెరికా రక్షణ వర్గాలు తమ అంతర్గత నివేదికలో వెల్లడించాలి. శుక్రవారం జరిగిన మారణహోమంలో 140పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రెంచ్ రాజధాని పారిస్లో నేషనల్ స్టేడియంలో వేలమంది గుమికూడి ఉన్న ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు తెగబడాన్ని, 2008లో ముంబాయిలో జరిగిన ఉగ్రవాది దాడితో పోల్చిచూస్తున్నాయి అమెరికా రక్షణవర్గాలు. తక్కువ మంది ఉగ్రవాదుల సాయంతో అత్యధిక స్థాయిలో భయాందోళనలు సృష్టించేందుకు ఉగ్రవాదులు ముంబాయి తరహా పంథాను ఎంచుకుని ఉంటారని రక్షణరంగం నిపుణులు అయిన జాన్ మిల్లర్ సిఎన్ఎన్ కు ఇచ్చిన్న ఇంటర్వ్యూలో తెలిపారు. ముంబాయి తరహా దాడులు మరిన్ని పునరావృతమవుతాయని తాము భావించిన విధంగానే పారిస్లో జరిగినట్లు మరికొంత మంది అమెరికాకు చెందిన రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు. జనసామాన్యాన్ని లక్ష్యంగా జరిగే ఇలాంటి మరిన్ని సామూహిక ఉగ్రవాద దాడులు పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

English summary

2008 Mumbai attacks are repeated in French,nearly 140 members died in that blast