ఒకనాడు ఒలింపిక్స్ ఛాంపియన్.. ఇప్పుడు పూరీలు అమ్ముకుంటోంది!

2011 Olympics champion Sita Sahu selling puri's

04:27 PM ON 27th August, 2016 By Mirchi Vilas

2011 Olympics champion Sita Sahu selling puri's

ఇది మనదేశంలో క్రీడాకారుల పట్ల చూపిస్తున్న శ్రద్ధ, ఆదరణ.. ఈమధ్య జరిగిన రియో ఒలంపిక్స్ లో విజేతలుగా నిలిచిన సింధు, సాక్షిలపై కోట్ల కొద్దీ కాసుల వర్షం కురుస్తోంటే, ఆనాటి స్పెషల్ ఒలంపిక్ లో మధ్యప్రదేశ్ కు చెందిన సీతా సాహు అనే క్రీడాకారిణి ఏకంగా రెండు కాంస్య పతకాలను సాధించినప్పటికీ ఎటువంటి ప్రోత్సాహకం లేక బతుకుదెరువు కోసం ఇప్పుడు పూరీలు అమ్ముకునే పరిస్థితి ఇది. ఓసారి వివరాల్లోకి వెళ్తే.. సీతా సాహు 2011లో జరిగిన స్పెషల్ ఒలంపిక్స్ లో 200, 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ఏకంగా రెండు కాంస్య పతకాలను భారత్ కు తెచ్చి పెట్టింది. భారత పరువు కాపాడినప్పటికీ ఆమె ప్రతిభ మన దేశ రాజకీయ నాయకులకు కనిపించకపోవడంతో తన పరుగును కొనసాగించలేక ఆపేసింది.

జీవనం గడవడమే కష్టమైన కుటుంబంలో పుట్టిన తనకు శిక్షణ తీసుకునేంత స్తోమత లేదు. అలాగని ఏ ప్రభుత్వం సహాయం లేకుండా పోయింది. ఇక చేసేదిలేక సీతా సాహు తన పరుగును ట్రాక్ పైనే ఆపేసి జీవనాధారం కోసం పూరీలమ్ముకుంటుంది. ఇలాంటి ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు అందించకపోవడం వల్లే రియో ఒలంపిక్ లో ఒక్క పతకం కోసం చివరి రోజు వరకూ ఎదురు చూసే దుస్థితి భారత్ కు వచ్చిందని చెప్పవచ్చు. దేశంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు లేక కాదు వారిని గుర్తించి ప్రోత్సహించాల్సిన నాయకుల్లోనే ప్రతిభ లేదని నెటిజన్లు తెలుపుతున్నారు. సీతా సాహు దుస్థితి మరో క్రిడాకారులకు రాకూడదని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కోట్లకు కోట్లు కుమ్మరించడం ఎంత తప్పో, అస్సలు పట్టించుకోకపోవడం కూడా అంతే తప్పు. ఇప్పటికైనా సమగ్ర క్రీడా విధానం రూపొందించాలని పలువురు నెటిజన్ల వాదన.

ఇది కూడా చదవండి: వరల్డ్ ఛాంపియన్ ని చంపేసిన ప్రభుత్వం!

ఇది కూడా చదవండి: నడిరోడ్డుపై నీలిచిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యాడు!

ఇది కూడా చదవండి: పుట్టబోయే పిల్లలు తెలివిగా, ఆరోగ్యంగా పుట్టాలంటే ఏం చెయ్యాలి?

English summary

2011 Olympics champion Sita Sahu selling puri's