2015@ క్రికెటర్ల పెళ్లి సందడి

2015 Indian Cricketers Wedding Season

07:24 PM ON 24th December, 2015 By Mirchi Vilas

2015 Indian Cricketers Wedding Season

2015 టీమిండియా క్రికెటర్లకు మరపురాని సంవత్సరంగా నిలిచింది. ఎందుకంటే చాలామంది ఇంట పెళ్లి బాజా మోగింది. జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్లు.. కొత్తగా జట్టులోకి వచ్చిన యువకులు ఇలా చాలామంది అవకాశం ఉన్నప్పుడే ఓ ఇంటివాడైపోతే ఓ పనైపో తుందనుకున్నారు. పెళ్లి బంధానికి చేరువైన క్రికెటర్లలో దినేష్ కార్తీక్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, సురేష్‌రైనా, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. యువరాజ్, జహీర్, హర్భజన్, దినేష్ కార్తిక్ వంటి వారు పేలవ ప్రదర్శన కారణంగా జట్టులో స్థానం కోల్పోయారు. యూవీ, భజ్జీ ఇప్పుడు మళ్లీ టీమ్ లోకి వచ్చారనుకోండి. ఈ నేపథ్యంలోనే జట్టులోకి యువ ప్లేయర్లు దూసుకువస్తుండడంతో వీరంతా తమ స్థానాలను దక్కించుకునే ప్రయత్నంలో దాదాపు విఫలమైన వారే. మంచి ఊప్‌లో ఉన్నప్పుడే లవ్ గేమ్ ప్రారం భించిన ఈ స్టార్స్ తమ ప్రియురాళ్లతో పెళ్లి పీటలెక్కారు. దీనికి భిన్నంగా రోహిత్ శర్మ, సురేష్‌రైనా, రవిచంద్రన్ అశ్విన్ ఆటలో తమదైన నైపుణ్యాన్ని పదర్శిస్తునే 2015లో కొత్త జీవితానికి ఆహ్వానం పలికారు.

1/6 Pages

హర్బజన్  సింగ్

సీనియర్లందరిలో కొంత మెరుగైన అవకాశాలను సాధించుకున్న భజ్జీ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు గత అక్టోబర్‌లో ఓ ఇంటివాడయ్యాడు. లాంగ్ టైమ్ గాళ్ ఫ్రెండ్ గీతాబస్రాను పెళ్లి చేసుకొని న్యూ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. పెళ్లికి ముందు అనుకోకుండా లభించిన అవకాశంతో బంగ్లా టూర్‌కు వెళ్లాడు. ఆ తర్వాత సౌతాఫ్రి కాతో స్వదేశంలోనూ టీ20 సిరీస్ ఆడాడు. ఇదే మంచి సమయం అనుకున్న భజ్జీ బస్రాతో 5 ఏళ్ల ప్రేమాయణన్ని మూడు ముళ్ల బంధంగా మార్చాడు.

English summary

In 2015, few of our top cricket players got engaged and few of are got married. Read this article for more information.