అవినీతి లేని దేశమే లేదా ....

2015 International Corruption Index

06:46 PM ON 27th January, 2016 By Mirchi Vilas

2015 International Corruption Index

అంతా అవినీతి మయం అంటుంటాం. దేశం పాడైపోయిందని అవినీతి చేష్టలు చూసి చాలామంది అనేమాటే .అయితే ప్రపంచ వ్యాప్తంగా అవినీతి లేని దేశమంటూ లేదని మరోసారి రుజువైంది. కాస్త తక్కువో.. ఎక్కువో అన్ని దేశాల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. దీన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు తమ ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అయితే మన దేశంలో అవినీతి స్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు లేకున్నా, 2014లో ఉన్నంతే 2015లోనూ ఉండడం విశేషం . ఇటీవల విడుదలైన ఓ నివేదికలో ఈ విషయం బహిర్గతమైంది.

2015 కి సంబంధించి ఆయా దేశాల్లోని అవినీతి స్థాయిపై ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌ విడుదలైంది. దేశాల్లో ఉన్న అవినీతి స్థాయి ప్రకారం, వాటికి కొన్ని మార్కులు కూడా వేశారు. అంటే, అవినీతి కొంచెం కూడా లేని దేశానికి 100 పాయింట్లు, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన దేశాలకు సున్నా పాయింట్లు కేటాయించారు. అయితే ఈ జాబితాలో ఏ దేశం కూడా 100 పాయింట్లను దక్కించుకోలేదు. 91 పాయింట్లతో ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా డెన్మార్క్‌ తొలిస్థానంలో ఉంది. కాగా.. 38 పాయింట్లతో భారత్‌ ఈ జాబితాలో 76వ స్థానంలో ఉంది.

అయితే ఈ జాబితాలో భారత్‌ పాస్‌ మార్కులను సంపాదించుకున్నా.. గతేడాదితో పోలిస్తే.. ఇందులో ఎలాంటి మార్పు కనిపించలేదు. అంటే.. 2014లోనూ భారత్‌ ఇదే పాయింట్లతో ఇదే స్థానంలో ఉందని.. నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ జాబితాలో రష్యా, చైనాలతో పోల్చుకుంటే భారత్‌ పరిస్థితి మెరుగ్గానే ఉంది. 37 పాయింట్లతో చైనా 83వ స్థానం, 29 పాయింట్లతో రష్యా 119వ స్థానంలో ఉన్నాయి. ఇక అవినీతి నిర్మూలనలో గ్రీస్‌, సెనెగల్‌, యూకే దేశాల ప్రణాళికలు 2015లో మెరుగ్గా ఉన్నాయని నివేదిక చెబుతోంది. కాగా లిబియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, స్పెయిన్‌, టర్కీ దేశాల్లో అవినీతి స్థాయి 2014 సంవత్సరం కన్నా, హెచ్చుగా వున్నట్లు తేలింది.

English summary

2015 International Corruption Index released recently and India stands in 76th position with 38 points around the world.With 91 points Denmark stands at top with less number of Corruption .